News March 31, 2025

వనపర్తి: కొడుకు మృతి తట్టుకోలేక.. తండ్రి ఆత్మహత్య

image

కుమారుడి మరణాన్ని తట్టుకోలేక ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన గోపాల్‌పేట మండలంలో జరిగింది. గ్రామస్థుల వివరాలు.. బుద్దారానికి చెందిన కోదండరాములు(55) కుమారుడు ఆంజనేయులు భార్యతో గొడవలు, ఇంటి సమస్యల కారణంగా ఇటీవల ఇంట్లో ఉరేసుకున్నాడు. కోదండరాములు చిన్న కొడుకు సైతం ఏడాది క్రితం అనారోగ్యానికి గురై మృతిచెందాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తండ్రి శనివారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Similar News

News January 6, 2026

జాతీయ రహదారి పనులను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

పుట్టపర్తి మండలంలో విజయవాడ-బెంగళూరు మధ్య జాతీయ రహదారి-544 జీ జాతీయ రహదారి పనులను మంగళవారం కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు. 52 కిలోమీటర్ల రోడ్డును 7 రోజులపాటు నిరంతరంగా 600లకు పైగా కార్మికులతో నిర్మాణం సాగించి రికార్డు సాధించడానికి కృషి చేస్తున్నామని నిర్మాణ సంస్థ ప్రతినిధులు అన్నారు. జాతీయ రహదారిని నాణ్యతతో నిర్మించాలని కలెక్టర్, ఎస్పీ తెలిపారు.

News January 6, 2026

భద్రాచలంలో వైభవంగా రామయ్య నిత్య కళ్యాణ వేడుక

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో రామయ్య నిత్య కళ్యాణం వేడుక మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళ తాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి బేడా మండపంలో కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్య వాచనం అనంతరం కంకణ ధారణ, యౌక్త్రధారణ గావించి నిత్య కళ్యాణాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు.

News January 6, 2026

సంక్రాంతి సెలవులు.. ఇంటికి వెళ్లాలంటే చుక్కలే..

image

సంక్రాంతి సెలవుల్లో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే వారికి ఈసారి చుక్కలు కనిపించేలా ఉన్నాయి. హైదరాబాద్-విజయవాడ హైవేలోని బ్లాక్ స్పాట్ల వద్ద రిపేర్లు చేస్తుండటంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ముఖ్యంగా LB నగర్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ వరకు భారీగా ట్రాఫిక్ ఆగిపోతోంది. విజయవాడకు వెళ్లాలంటే 8 గంటల సమయం పడుతోంది. దీంతో నార్కట్‌పల్లి నుంచి ట్రాఫిక్ మళ్లించేందుకు ప్లాన్ చేస్తున్నారు.