News March 31, 2025
పెబ్బేరు: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందిన ఘటన పెబ్బేరులో నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. జాతీయ రహదారిపై గుర్తుతెలియని మహిళ(40)ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడకక్కడే మృతిచెందింది. మృతురాలు మతిస్తిమితం లేక రోడ్డు వెంట తిరుగుతుందా లేక ఇంకేమైనా కారణాల అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Similar News
News April 3, 2025
నారాయణపేట: టెన్త్ క్లాస్ పాసయ్యారా..? మీ కోసమే..!

సేవా భారతి, ఇన్ఫోసిస్ నిర్మాణ్ ఆధ్వర్యంలో ఈనెల 4న నారాయణపేట నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు సేవా భారతి పాలమూరు విభాగ్ కార్యదర్శి శ్రీనివాస్ గౌస్ బుధవారం తెలిపారు. జిల్లాలోని టెన్త్ క్లాస్, ఐటీఐ, ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ చదువుతున్న, సమానమైన అర్హతలు ఉన్న విద్యార్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చని చెప్పారు. శుక్రవారం ఉ.10 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందన్నారు.
News April 3, 2025
MDK: కలెక్టర్ జాయిన్ చేసిన బాలిక అదృశ్యం..?

పాపన్నపేట కేజీబీవీ నుంచి బాలిక అదృశ్యమైంది. మెదక్ బాలసదనంలో అనాథగా ఉన్న ఓ బాలికను కలెక్టర్ తీసుకొచ్చి ఇటీవల పాపన్నపేట కేజీబీవీలో 8వ తరగతిలో జాయిన్ చేశారు. అయితే ఆ బాలికను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కేజీబీవీ అధికారులు మాత్రం కనీసం పట్టించుకోలేదు. తల్లిదండ్రులు ఎవరూ లేని ఒక విద్యార్థినిని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయగా అక్కడి నుంచి బాలిక వెళ్లిపోయినట్లు తెలిసింది.
News April 3, 2025
జిల్లాకు 4,549 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు

జిల్లాలో 4,549 ఇందిరమ్మ ఇళ్ల మంజూరయ్యాయని కలెక్టర్ తేజస్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఎంపీడీవోలు, హౌసింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అర్హత ఉన్నవారికి ఇళ్లు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా జరిగిన పనుల వివరాలు, మిగిలిన నిధులను నివేదిక ద్వారా సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.