News March 31, 2025
NGKL: ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు: కలెక్టర్

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ రంజాన్ పండగ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలందరూ ప్రవక్త సూచించిన మార్గంలో నడవాలని ఆకాంక్షించారు. ముస్లింలు అతిపెద్ద పండుగగా నిర్వహించే రంజాన్ వారి యొక్క కుటుంబాలలో సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలను నింపాలని ఆకాంక్షించారు. పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు.
Similar News
News January 19, 2026
ప్లాస్టిక్ రహిత జిల్లాగా మారుద్దాం: కలెక్టర్

స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘స్వచ్ఛ భారత్ యాత్ర’ వాహనం 9వ రోజు సోమవారం కామారెడ్డి కలెక్టరేట్‌కు చేరుకుంది. ఈ వాహనాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, తడి-పొడి చెత్త ఏర్పాటు, వ్యర్థాల నుంచి వస్తువుల తయారీ విధానాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆయన వీక్షించారు.
News January 19, 2026
WPL: RCBతో మ్యాచ్.. టాస్ గెలిచిన గుజరాత్

ఉమెన్స్ ప్రీమియర్స్ లీగ్‌లో ఇవాళ గుజరాత్, బెంగళూరు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో ఓటమే(4 మ్యాచులు) ఎరుగని RCB ఈ మ్యాచులోనూ గెలిచి విజయపరంపర కొనసాగించాలని చూస్తోంది. అటు తొలి రెండింట్లో ఓడి తర్వాతి 2 మ్యాచుల్లో నెగ్గిన గుజరాత్ RCBకి తొలి ఓటమి రుచి చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. మరి ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
News January 19, 2026
సిద్దిపేట: స్వగ్రామానికి చిన్నారి మృతదేహం

కోహెడ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన గుడికందుల స్నిజ్ఞ(5) భవనంపై నుంచి పడి తీవ్ర గాయాలపాలై హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసింది. ఆ చిన్నారిని కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులు, దాతలు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. సోమవారం ఆసుపత్రి నుంచి చిన్నారి మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.


