News March 26, 2024
ఆమదాలవలస: విరిగిన ఆటో చక్రం… తప్పిన ప్రమాదం

ఆమదాలవలస నుంచి శ్రీకాకుళం వెళ్లే ప్రధాన రహదారి విస్తరణ పనులు పూర్తిస్థాయిలో జరగకపోవడంతో గోతుల రహదారిలోనే ప్రయాణించాల్సి వస్తుందని పలువురు వాహనదారులు వాపోతున్నారు. తాజాగా సోమవారం రాత్రి గోతిలో దిగబడిన ఆటో ముందు చక్రం విరిగిపడింది. అయితే ఆ సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పిందని ఆటో డ్రైవర్ లక్ష్మీనారాయణ తెలిపారు. రహదారిని బాగు చేయాలని కోరారు.
Similar News
News January 9, 2026
శ్రీకాకుళం: ప్రభుత్వ న్యాయవాదిగా ఇప్పిలి తాత నియామకం

శ్రీకాకుళం జిల్లా కోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా ఇప్పిలి తాతను ప్రభుత్వం నియమించింది. గురువారం సాయంత్రం ఈ ఆదేశాలు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ పదవిలో తను మూడేళ్లు కొనసాగుతానని చెప్పారు. గతంలో ఈయన నరసన్నపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేశారు. పలువురు న్యాయవాదులు ఆయనను అభినందించారు.
News January 9, 2026
SKLM: డిగ్రీ విద్యార్థులకు అలర్ట్

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల నోటిఫికేషన్ను పరీక్షల విభాగం అధికారి పద్మారావు గురువారం ఓ ప్రకటనలో విడుదల చేశారు. విద్యార్థులు పరీక్ష ఫీజును ఈనెల 18వ తేదీ లోపు కళాశాలల్లో, యూనివర్సిటీలో చెల్లించాలని సూచించారు. పరీక్షలు ఫిబ్రవరి మొదటి వారం నుంచి నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలకు కాలేజీలకు సంప్రదించాలన్నారు.
News January 9, 2026
శ్రీకాకుళం: సంక్రాంతి ముందు..ప్రయాణికులకు షాక్

శ్రీకాకుళం ఆర్టీసీ హైయర్ బస్సు యజమానులు గురువారం జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణకు సమ్మె నోటీస్ అందజేశారు. ఈనెల 12 నుంచి సమ్మె చేయనున్నట్లు నోటీసులో ప్రస్తావించారు. మహిళల ఉచిత బస్సు పథకం స్త్రీ శక్తిలో భాగంగా బస్సుకు నెలకు అదనంగా రూ.20 వేలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఆక్యుపెన్సీ పెరిగినా గిట్టుబాటు ధర చెల్లించడం లేదని, ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.


