News March 31, 2025
గాయం నుంచి ఇంకా కోలుకోలేదు: హీరోయిన్

జిమ్ చేస్తూ గాయపడిన తాను ఇంకా పూర్తిగా కోలుకోలేదని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. గత ఏడాది చివర్లో ఆమె వెయిట్ లిఫ్ట్ చేసే క్రమంలో గాయపడ్డారు. తాను చాలా విషయాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ప్రతికూల పరిస్థితుల్లోనూ కమిట్ అయిన సినిమాలను తాను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు సినిమాలకు దూరమయ్యారు.
Similar News
News February 9, 2026
చెరువు మట్టితో చాలా లాభాలున్నాయ్

చెరువులోని పూడిక మట్టిని పొలంలో వేస్తే భూమికి, పంటకు చాలా మేలు జరుగుతుంది. చెరువులో నీరు నిల్వ ఉన్నప్పుడు ఆకులు, గడ్డి వ్యర్థాలు కుళ్లి మట్టిలో చేరతాయి. వేసవిలో చెరువులు అడుగంటుతాయి. అప్పుడు చెరువు మట్టిని పొలాల్లో వేస్తే నత్రజని, భాస్వరం, పొటాషియం, జింకు, బోరాన్, సేంద్రియ కర్భన పదార్థాలతో పాటు.. మొక్కల పెరుగుదలకు కావాల్సిన సూక్ష్మ జీవులు, పంటకు మేలు చేసే మిత్ర పురుగులు నేలలో వృద్ధి చెందుతాయి.
News February 9, 2026
364 అప్రెంటిస్ పోస్టులు.. అప్లై చేశారా?

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 364 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీఈ, బీటెక్, డిగ్రీ(BA,BCom,BBA,LLB), డిప్లొమా, ఐటీఐ అర్హత గల వారు ఫిబ్రవరి 28 వరకు NATS/NAPS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.uraniumcorp.in
News February 9, 2026
రేపు స్పీకర్‌పై అవిశ్వాస అస్త్రం!

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్ష ఇండీ కూటమి సిద్ధమైంది. సభలో తమ గొంతు నొక్కేస్తున్నారని, స్పీకర్ నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష MPలు ఈ నిర్ణయం తీసుకున్నారు. నరవణె పుస్తక ప్రస్తావన సమయంలో రాహుల్ గాంధీని అడ్డుకోవడం, ప్రధానిపై దాడికి ప్రయత్నిస్తున్నారంటూ మహిళా MPలపై నిరాధార ఆరోపణలు చేయడం ఈ వివాదానికి ఆజ్యం పోశాయి.


