News March 31, 2025

రాజన్న సిరిసిల్ల: గ్రామాల్లో జోరుగా పైరవీలు..?

image

SRCL జిల్లావ్యాప్తంగా జరిగిన ప్రజాపాలనలో ప్రజలు ఇందిరమ్మ ఇండ్లకోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ప్రభుత్వం ఇప్పటివరకు లబ్ధిదారుల లిస్ట్‌ను ఫైనల్ చేయలేదు. జిల్లాకు 7,000 ఇళ్లు మంజూరైన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలోని అధికారపార్టీకి చెందిన చోటామోటా నాయకులు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని జోరుగా పైరవీలు సాగిస్తున్నట్లు సమాచారం. అసలైన అర్హులు తమకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందో, రాదో అని ఆందోళన చెందుతున్నారు.

Similar News

News April 3, 2025

నారాయణపేట: టెన్త్ క్లాస్ పాసయ్యారా..? మీ కోసమే..!

image

సేవా భారతి, ఇన్ఫోసిస్ నిర్మాణ్ ఆధ్వర్యంలో ఈనెల 4న నారాయణపేట నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు సేవా భారతి పాలమూరు విభాగ్ కార్యదర్శి శ్రీనివాస్ గౌస్ బుధవారం తెలిపారు. జిల్లాలోని టెన్త్ క్లాస్, ఐటీఐ, ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ చదువుతున్న, సమానమైన అర్హతలు ఉన్న విద్యార్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చని చెప్పారు. శుక్రవారం ఉ.10 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందన్నారు.  

News April 3, 2025

MDK: కలెక్టర్ జాయిన్ చేసిన బాలిక అదృశ్యం..?

image

పాపన్నపేట కేజీబీవీ నుంచి బాలిక అదృశ్యమైంది. మెదక్ బాలసదనంలో అనాథగా ఉన్న ఓ బాలికను కలెక్టర్ తీసుకొచ్చి ఇటీవల పాపన్నపేట కేజీబీవీలో 8వ తరగతిలో జాయిన్ చేశారు. అయితే ఆ బాలికను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కేజీబీవీ అధికారులు మాత్రం కనీసం పట్టించుకోలేదు. తల్లిదండ్రులు ఎవరూ లేని ఒక విద్యార్థినిని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయగా అక్కడి నుంచి బాలిక వెళ్లిపోయినట్లు తెలిసింది.

News April 3, 2025

జిల్లాకు 4,549 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు

image

జిల్లాలో 4,549 ఇందిరమ్మ ఇళ్ల మంజూరయ్యాయని కలెక్టర్ తేజస్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఎంపీడీవోలు, హౌసింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అర్హత ఉన్నవారికి ఇళ్లు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా జరిగిన పనుల వివరాలు, మిగిలిన నిధులను నివేదిక ద్వారా సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

error: Content is protected !!