News March 31, 2025
శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం

AP: వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కన్పిస్తోంది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. మరోవైపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లలో వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామిని 62,263 మంది దర్శించుకోగా.. 25,733 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.65 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
Similar News
News April 4, 2025
38 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల ప్రకటన

AP: రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల పంపకం కొనసాగుతోంది. ఇటీవల 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను ప్రకటించగా, ఇవాళ మరో 38 కమిటీలకు ప్రభుత్వం నియామకాలు చేసింది. ఇందులో 31 టీడీపీకి, 6 జనసేనకు, ఒకటి బీజేపీకి దక్కింది. త్వరలోనే మిగతా కమిటీలకు ఛైర్మన్లను ప్రకటిస్తామని టీడీపీ వెల్లడించింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా 218 మార్కెట్ కమిటీలున్నాయి.
News April 4, 2025
బ్లడ్‌బాత్.. రూ.11 లక్షల కోట్ల సంపద ఆవిరి

అమెరికా సుంకాల వేళ భారత స్టాక్ మార్కెట్లు మరోసారి భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 930 పాయింట్లు, నిఫ్టీ 345 పాయింట్లు కోల్పోవడంతో సుమారు రూ.11 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. మదుపరులు అమ్మకాలకు మొగ్గు చూపడంతో ONGC, హిందాల్కో, సిప్లా షేర్లు అత్యధికంగా 6శాతం చొప్పున నష్టపోయాయి. టారిఫ్ దెబ్బకు ఆటోమొబైల్, ఫార్మా, ఐటీ, మెటల్ రంగాల షేర్లు కుదేలయ్యాయి.
News April 4, 2025
MIకి గుడ్‌న్యూస్.. త్వరలోనే బుమ్రా ఆగమనం?

ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. వెన్నెముక గాయంతో BGT సిరీస్ ఆఖరి మ్యాచ్‌లో ఆయన దూరమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రికవరీలోనే ఉన్న ఈ పేసర్ తిరిగి ఫిట్‌నెస్ సాధించినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. మరో రెండు మ్యాచ్‌ల తర్వాత నుంచి ఆయన అందుబాటులోకి రానున్నారని తెలిపాయి. ఈలోపు తుది దశ ఫిట్‌నెస్ టెస్టుల్లో పాల్గొంటారని సమాచారం.