News March 31, 2025
ఏప్రిల్ 6,7 తేదీల్లో భద్రాచలంలో మద్యం షాపులు బంద్

భద్రాద్రి రామాలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఏప్రిల్ 6,7 తేదీల్లో భద్రాచలంలో మద్యం షాపులను మూసివేయాలని ఇప్పటికే కలెక్టర్ఆదేశించారు. ఏప్రిల్6న సీతారాముల కళ్యాణం, 7న పట్టాభిషేకం జరుగుతాయి. ఎండల నుంచి భక్తులకు ఉపశమనం కలిగించేలా ఫాగ్, 50 టన్నుల భారీ ఏసీ, వంద కూలర్లు, 250 ఫ్యాన్లను అమర్చుతున్నారు. 2 వేల మంది పోలీసులతో ఎస్పీ రోహిత్‌రాజ్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ భద్రతా ఏర్పాట్లు చేశారు.
Similar News
News September 17, 2025
పెద్దపల్లి ఆసుపత్రిలో హెపటైటిస్ బీ టీకా కార్యక్రమం ప్రారంభం

పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి హెపటైటిస్ బీ నిరోధక టీకా కార్యక్రమాన్ని బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ ప్రారంభించారు. రక్తం, శరీర ద్రవాల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి వైద్య సిబ్బందికి సోకే ప్రమాదం ఉందని ఆమె పేర్కొన్నారు. రక్షణ చర్యగా జీరో డోస్ తర్వాత నెలకు ఒకటి, ఆరు నెలలకుపైగా మరో డోస్ తీసుకోవాలని సూచించారు.
News September 17, 2025
గోదావరిఖని నుంచి బీదర్‌కు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు

GDK RTC డిపో ఆధ్వర్యంలో పుణ్యక్షేత్రాల సందర్శన కోసం ఈ నెల 25వ తేదీ రాత్రి 10 గంటలకు బీదర్‌కు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుంది. ఈ ట్రిప్‌లో భక్తులు బీదర్ జల నరసింహస్వామి, రేజింతల్, జరసంగమం పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చని DM నాగభూషణం తెలిపారు. ఈ యాత్ర 26వ తేదీ రాత్రికి GDK తిరిగి చేరుకుంటుంది. టికెట్ ₹1,600గా ధర నిర్ణయించారు. టిక్కెట్ల రిజర్వేషన్ కోసం 7013504982 నంబర్‌ను సంప్రదించవచ్చు.
News September 17, 2025
ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో మంత్రి సురేఖ

వరంగల్ ఓ సిటీ IDOC మైదానంలో ఏర్పాటుచేసిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ముఖ అతిధిగా మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య శారద దేవి, ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.