News March 31, 2025

విజయవాడ: పున్నమి ఘాట్‌లో మృతదేహం 

image

కృష్ణానది పున్నమి ఘాట్ వద్ద గుర్తుతెలియని మగ మృతదేహం లభ్యమైనట్లు భవానిపురం పోలీసులు తెలిపారు. పున్నమి ఘాట్ వద్ద ఆదివారం గుర్తుతెలియని మృతదేహం ఉందన్న సమాచారం మేరకు వెళ్లి పరిశీలించామన్నారు. మృతుడికి 35 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉంటుందన్నారు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉందని, మృతుడి ఒంటిపై ఎరుపు కలర్ షర్ట్, చెక్స్ ప్యాంట్ ఉన్నాయన్నారు.  

Similar News

News November 18, 2025

TML: టోకెన్లు లేకుండా శ్రీనివాసుడి దర్శనం

image

తిరుమలలో జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శనానికి టీటీడీ ప్రాధాన్యమిచ్చింది. గత అనుభవాల దృష్ట్యా ఆఫ్‌లైన్ టోకెన్లను పూర్తిగా రద్దు చేసింది. కొండకు వచ్చిన వాళ్లు వచ్చినట్లు నేరుగా దర్శనానికి వెళ్లిపోవచ్చు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల్లో 182 గంటల పాటు ఉంటుంది. ఇందులో 164 గంటలు సామాన్య భక్తులనే అనుమతిస్తారు. ఇదే సమయంలో ఎక్కువ టైం షెడ్డుల్లో ఉంచకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.

పత్తి కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

image

ఆదోనిలోని NDBL జిన్నింగ్ & ప్రెస్సింగ్, దాదా పీర్ మిల్ యూనిట్లలో CCI ద్వారా జరుగుతున్న పత్తి కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ ఏ.సిరి మంగళవారం పరిశీలించారు. స్థానిక మార్కెట్ యార్డ్ అధికారులతో కలిసి కోనుగోలు కేంద్రాల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న వాటిపై ఆరా తీశారు. అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించా. ఆమెతో పాటు జిల్లా వ్యవసాయ అధికారిణి వరలక్ష్మీ ఉన్నారు.