News March 31, 2025

గ్రూప్‌-1 ఫలితాల్లో నల్గొండ జిల్లా వాసికి సెకండ్ ర్యాంక్

image

నల్గొండకు చెందిన దాది వెంకటరమణ గ్రూప్‌-1లో 535 మార్కులతో జనరల్‌ ర్యాంకుల్లో స్టేట్ సెకండ్ ర్యాంక్‌ సాధించారు. వెంకటరమణ ఐదేండ్లుగా సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నారు. తల్లిదండ్రులు దాది శ్రీనివాసరావు ఐడీసీలో ఏఈగా, తల్లి రమాదేవి అనుముల మండలం అలీనగర్‌ ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈ సంవత్సరం ప్రభుత్వం వెల్లడించిన జేఎల్‌, డీఏఓ, గ్రూప్‌-2, గ్రూప్‌-3 ఉద్యోగాలకు సైతం వెంకటరమణ ఎంపికయ్యారు.

Similar News

News October 19, 2025

యాప్‌ల సంఖ్య తగ్గించాం: DEO రేణుక

image

ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విలువైన బోధన సమయాన్ని దృష్టిలో ఉంచుకొని పూర్వం అమల్లో ఉన్న యాప్‌లను తగ్గించి కనిష్ఠ సంఖ్యకు తీసుకొచ్చినట్లు డీఈవో సి.వి. రేణుక తెలిపారు. అసెస్మెంట్ పుస్తకాల విషయంలో ఉపాధ్యాయుల అభ్యంతరాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయన్నారు. పిల్లలకు మధ్యాహ్న భోజన పథక వివరాలు అందించడానికి ప్రధానోపాధ్యాయుల విధులలో భాగమని అన్నారు.

News October 19, 2025

దీపావళి: లక్ష్మీ పూజలో ఏ వస్తువులు ఉండాలి?

image

దీపావళి లక్ష్మీ పూజలో సమర్పించే కొన్ని వస్తువులు ఐశ్వర్యం, శ్రేయస్సును ప్రసాదిస్తాయని నమ్ముతారు. లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ చిత్ర పటాలు పెడితే శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. దేవతల నివాసంగా పేర్కొనే శంఖాన్ని, సంపదకు చిహ్నాలుగా భావించే బంగారం, వెండి నాణేలు, నోట్లు, పసుపు గౌరమ్మలను పూజలో ఉంచాలని సూచిస్తున్నారు. కమల పువ్వులు, శ్రీ యంత్రం, పసుపు కొమ్ములు ఉంచడం అదృష్టాన్ని తెస్తుందంటున్నారు.

News October 19, 2025

రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ప్రకటించారు. సోమవారం దీపావళి సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్నందున ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం లేదని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.