News March 31, 2025
‘బేబి’కి రూ.కోటి రెమ్యూనరేషన్?

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడి తెలుగు హీరోయిన్ వైష్ణవి చైతన్యకు సరిపోతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత ఉండగా ఆ అవకాశాన్ని ‘బేబీ’ హీరోయిన్ క్యాష్ చేసుకుంటున్నారు. డిమాండ్‌కు తగ్గట్లు ఆమె పారితోషికం పెంచారని టాక్. ఒక్కో సినిమాకు రూ.కోటి పైనే డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె సిద్ధూతో కలిసి ‘జాక్’లో నటిస్తోండగా ఆనంద్ దేవరకొండతో మరో సినిమాకు ఓకే చెప్పారు.
Similar News
News April 3, 2025
IPL: KKRపై SRH పైచేయి సాధిస్తుందా?

ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ KKR-SRH మధ్య మ్యాచ్ జరగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు వరుస ఓటములతో డీలాపడ్డ ఆరెంజ్ ఆర్మీ తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. కేకేఆర్‌ను ఓడించి మళ్లీ విన్నింగ్ ట్రాక్‌లోకి రావాలని పట్టుదలగా ఉంది. మరోవైపు కేకేఆర్ ఒక గెలుపు, రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఈ మ్యాచులో గెలిచి సత్తా చాటాలని ఎదురుచూస్తోంది.
News April 3, 2025
భారత్‌లో భూకంపాలు వచ్చే ప్రదేశాలు ఇవే!

మయన్మార్‌లో భూకంపం సంభవించి వేలాది మంది ప్రజలు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. కాగా మనదేశంలో కూడా భూప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, JK ప్రాంతాలు 9 తీవ్రతతో భూకంపాలు వచ్చే జోన్ పరిధిలో ఉన్నాయి. ఢిల్లీ, హరియాణా, మహారాష్ట్రలో 8, రాజస్థాన్, కొంకణ్ తీరంలో 7, కర్ణాటక, TG, AP, ఒడిశా, MPలో 7 కంటే తక్కువ తీవ్రతతో భూకంపాలు సంభవించే అవకాశం ఉందని చెబుతున్నారు.
News April 3, 2025
స్టైలిష్ లుక్‌లో ఎన్టీఆర్.. పిక్స్ వైరల్

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ స్టైలిష్ లుక్‌లో కనిపించారు. బ్లాక్ అండ్ వైట్ అవుట్‌ఫిట్‌లో కళ్లద్దాలు ధరించి స్టన్నింగ్ లుక్‌లో మెరిశారు. టోక్యోలోని ఓ స్టార్ హోటల్‌లో ఈ ఫొటోలకు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలను తన అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఓ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.