News March 31, 2025
మంచిర్యాల: సింగరేణి TO గ్రూప్-1 RANKER

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలానికి చెందిన సింగరేణి అధికారి దుర్గం క్రాంతి గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటాడు. 452.5 మార్కులతో 552 ర్యాంక్ సాధించాడు. 2012-15లో డిప్లొమా ఇన్ మైనింగ్ పూర్తి చేశాడు. ప్రస్తుతం బెల్లంపల్లిలోని సింగరేణి శాంతిఖని గనిలో ఓవర్ మేన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటు సింగరేణిలో ఉద్యోగం చేస్తూనే గ్రూప్ -1కు సాధన చేసి తన సత్తాను చాటాడు.
Similar News
News April 3, 2025
హను రాఘవపూడితో ప్రభాస్ మరో సినిమా?

ప్రభాస్-హను రాఘవపూడి కాంబోలో ఫౌజీ(వర్కింగ్ టైటిల్) అనే సినిమా తెరకెక్కుతోందన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హను డైరెక్షన్ పట్ల ముగ్ధుడైన ప్రభాస్ ఆయనకు మళ్లీ ఛాన్స్ ఇస్తానని హామీ ఇచ్చారని, కథ రెడీ చేసుకోవాలని సూచించారని సమాచారం. అయితే ఇది తెరకెక్కేందుకు చాలా కాలం పడుతుందని సినీవర్గాలంటున్నాయి. డార్లింగ్ ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2, ప్రశాంత్ వర్మతో సినిమా చేస్తున్నారు.
News April 3, 2025
ప్రకృతి విధ్వంసాన్ని తక్షణమే ఆపాలి: ప్రొ.హరగోపాల్

రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి విధ్వంసాన్ని తక్షణమే నిలిపివేసి, గచ్చిబౌలి కంచ గచ్చిబౌలిలో అడవిని నాశనం చేయకూడదని ప్రొ.హరగోపాల్ సూచించారు. బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ అడవి ఎంతో సుసంపన్నమైన ప్రకృతి అని, చూస్తే కానీ అర్థం కాదన్నారు. ఈ అడవిలో ఎన్నో రకాల అరుదైన పక్షి జాతులు ఉన్నాయని, ఒకసారి ప్రకృతిని ధ్వంసం చేస్తే పునర్నిర్మాణానికి వందల ఏళ్లు పడుతుందని తెలిపారు.
News April 3, 2025
రాయితీ ఈ నెల వరకు: కలెక్టర్ హనుమంతరావు

లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్ )లో 25 శాతం రాయితీని ఈ నెల వరకు కొనసాగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ హనుమంత రావు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.