News March 31, 2025
గ్రూప్-1లో రఘునాథపల్లి యువకుడికి 332వ ర్యాంకు

గ్రూప్-1 ఫలితాల్లో రఘనాథపల్లి యువకుడు సత్తా చాటారు. కొయ్యడ ప్రభాకర్-లక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు ఉదయ్ ఆదివారం TGPSC ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో 463 మార్కులు సాధించి 332వ ర్యాంకు పొందారు. ఈయన ప్రస్తుతం సింగరేణిలో పర్సనల్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఉదయ్ సోదరుడు ప్రణయ్ 2023లో IASగా ఎంపికై ప్రస్తుతం HYDలో పోస్టింగ్ తీసుకున్నారు. ఉదయ్ గ్రూప్-1 ఉద్యోగం సాధించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News April 3, 2025
రామభద్రపురం: పొక్సో కేసులో నిందితుడికి మూడేళ్లు జైలుశిక్ష

పొక్సో కేసులో నిందితుడు కె.రమేశ్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు మూర్తి కె.నాగమణి తీర్పు ఇచ్చినట్లు బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు చెప్పారు. ఆరికతోట గ్రామానికి చెందిన రమేశ్ అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికపై లైంగిక వేదింపులకు పాలప్పడినట్టు రామభద్రపురం పోలీస్ స్టేషన్లో 2021లో కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో మూడేళ్లు జైలుశిక్ష, రూ.11వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు చెప్పారు.
News April 3, 2025
జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలపాలి: ప్రత్యేక అధికారి

అభివృద్ధి, సంక్షేమ పధకాల అమలులో ఏలూరు జిల్లా ను రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు కృషి చేయాలనీ సంక్షేమ పధకాల అమలు పర్యవేక్షణ ఏలూరు జిల్లా ప్రత్యేక అధికారి కె. ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో బుధవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తో కలిసి జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యాలయాల అమలు గురించి అధికారులతో సమావేశం నిర్వహించారు.
News April 3, 2025
గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సాధించడం అభినందనీయం: కలెక్టర్

రాష్ట్రవ్యాప్తంగా 1.5 లక్షల స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను ఓఎన్‌డీసీ ప్లాట్ ఫారమ్ ద్వారా అమ్మి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సాధించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో గిన్నిస్ బుక్ రికార్డ్స్ సర్టిఫికెట్లను మెప్మా అధికారులు జిల్లా కలెక్టర్‌కు చూపించారు.