News March 26, 2024
పోలింగ్ నిర్వహణలో అధికారులు, సిబ్బందే కీలకం: కలెక్టర్

సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించడంలో పోలింగ్ అధికారులు, సిబ్బందే అత్యంత కీలకమని గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్లోని వీసీ సమావేశ మందిరంలో ఎన్నికల విధులకు సిబ్బంది కేటాయింపు, శిక్షణలకు సంబంధించి సోమవారం అధికారులతో మాట్లాడారు. పోలింగ్ రోజు విధులు నిర్వహించే అధికారులు, ఇతర సిబ్బందికి సంబంధించి రాండమైజేషన్ చేపట్టాల్సి ఉందన్నారు.
Similar News
News April 18, 2025
తెనాలి: తప్పించుకొని తిరుగుతున్న నిందితుడి అరెస్ట్

తెనాలిలో 2022లో జరిగిన హత్య కేసులో నిందితుడు జాన్‌బాబు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. విజయవాడకు చెందిన జాన్‌బాబు హత్య కేసులో రెండో ముద్దాయిగా ఉండి కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. మూడు సంవత్సరాలుగా పోలీసులకు కనబడకుండా తిరుగుతున్న జాన్‌బాబును రూరల్ పోలీసులు ఎట్టకేలకు గురువారం అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో నెల్లూరు జైలుకు తరలించారు.
News April 17, 2025
మంగళగిరి: ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవలు

AIIMSలో ఇక పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. గుండె జబ్బులకు బైపాస్ సర్జరీలు, ICU విభాగం ప్రారంభమయ్యాయి. ఇటీవల మొదటి సర్జరీ విజయవంతంగా జరిగింది. 46 విభాగాల్లో సేవలందిస్తున్న ఈ ఆసుపత్రిలో రోజూ 3,500మందికి వైద్యం అందిస్తున్నారు. ఇప్పటి వరకు 22లక్షలపైగా రోగులకు సేవలు, 37లక్షల ల్యాబ్ పరీక్షలు నిర్వహించారు. మార్చి చివరి వరకు 4.39లక్షల ఓపీ రోగులు, 42,843 ఇన్‌పేషెంట్లకు సేవలు అందించారు.
News April 17, 2025
అమరావతిలో శాశ్వత సచివాలయానికి టెండర్‌ల విడుదల

అమరావతిని శాశ్వత రాజధానిగా తీర్చిదిద్దే దిశగా సీఎం చంద్రబాబు సర్కార్ కీలక అడుగు వేసింది. నాలుగు సచివాలయ టవర్‌లు, ఒక హెచ్‌వోడీ టవర్ నిర్మాణానికి సంబంధించిన రూ.4,668 కోట్ల విలువైన టెండర్‌లను సీఆర్డీఏ విడుదల చేసింది. మే 1న టెక్నికల్ బిడ్లను పరిశీలించి, తుది కాంట్రాక్టర్‌లను ఎంపిక చేయనున్నారు. మే 2న అమరావతికి ప్రధాని మోదీ రానుండటంతో, నిర్మాణాలపై స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ వేగం కనిపిస్తోంది.