News March 31, 2025
పెరిగిన బంగారం ధరలు

రెండ్రోజులుగా నిలకడగా ఉన్న బంగారం ధరలు నేడు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 పెరిగి రూ.91,190గా ఉంది. అటు 22 క్యారెట్ల పసిడి రూ.650 ఎగిసి రూ.84,250గా విక్రయిస్తున్నారు. గత పది రోజుల్లో బంగారంపై ఇది రెండో అత్యధిక పెరుగుదల. మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కేజీ ధర రూ.1,13,000గా విక్రయాలు జరుగుతున్నాయి.
Similar News
News April 3, 2025
ట్రంప్ టారిఫ్స్.. భారత్‌పై ప్రభావమెంత?

ప్రతీకార సుంకాలపై US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు. ఇందులో భారత్‌పై 26 శాతం సుంకం విధించారు. ఈ చర్యతో వ్యవసాయ ఉత్పత్తులు, బంగారం, వజ్రాలు, రసాయనాలు, యంత్రాలతోపాటు మరికొన్ని వస్తువులపై టారిఫ్స్ ప్రభావం ఎక్కువగా పడుతుందని నిపుణులు అంటున్నారు. సుంకాల కారణంగా భారత్‌కు రూ.26 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు. ఇది దేశ GDPపై 0.1% ప్రభావం చూపుతుందని విశ్లేషిస్తున్నారు.
News April 3, 2025
ఈ నెలలోనే ఏపీలో PM మోదీ పర్యటన!

AP: అమరావతి పనులను పున:ప్రారంభించేందుకు PM మోదీ ఈ నెలలోనే రాష్ట్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో CS విజయానంద్ రాష్ట్ర సచివాలయంలో ప్రాథమిక సమీక్ష నిర్వహించారు. PM పర్యటన తేదీ త్వరలో ఖరారు కానున్న నేపథ్యంలో శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు, ప్రధాని ఇవాళ థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి రాగానే AP పర్యటన తేదీ ఫిక్స్ కానుంది.
News April 3, 2025
IPL: KKRపై SRH పైచేయి సాధిస్తుందా?

ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ KKR-SRH మధ్య మ్యాచ్ జరగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు వరుస ఓటములతో డీలాపడ్డ ఆరెంజ్ ఆర్మీ తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. కేకేఆర్‌ను ఓడించి మళ్లీ విన్నింగ్ ట్రాక్‌లోకి రావాలని పట్టుదలగా ఉంది. మరోవైపు కేకేఆర్ ఒక గెలుపు, రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఈ మ్యాచులో గెలిచి సత్తా చాటాలని ఎదురుచూస్తోంది.