News March 31, 2025
ఆ 400 ఎకరాలు మాదే: టీజీ ప్రభుత్వం

TG: భూముల విక్రయాన్ని వ్యతిరేకిస్తూ HCU విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ఆ 400 ఎకరాల భూమి తమదేనని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఇందులో HCUకు సంబంధించిన భూమి లేదని స్పష్టం చేసింది. ఓ ప్రైవేటు సంస్థకు కేటాయించిన భూమిని న్యాయపోరాటం ద్వారా దక్కించుకున్నట్లు పేర్కొంది. భూమికి సంబంధించి ఎలాంటి వివాదమైనా కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని తెలిపింది. వేలం, అభివృద్ధి కోసం రాళ్ల తొలగింపు ఉండదని చెప్పింది.
Similar News
News July 5, 2025
10,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని EU డిమాండ్

APSRTCలో ఖాళీగా ఉన్న 10,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఎంప్లాయిస్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తమకు వెంటనే 11వ PRC బకాయిలు, పెండింగ్ DAలు చెల్లించాలని కోరింది. మరణించిన, రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌లు తక్షణం చెల్లించాలని నిన్న విజయవాడలో నిర్వహించిన ధర్నాలో కోరింది. అటు కొత్తగా కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను RTCకే అప్పగించాలని EU స్పష్టం చేసింది.
News July 5, 2025
WOW.. అంతరిక్షం నుంచి మెరుపు ఎలా ఉందో చూడండి

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తీసిన మెరుపు ఫొటో నెటిజన్లను మైమరిపిస్తోంది. దీనిని స్ప్రైట్ అని పిలుస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇది సాధారణ మెరుపులా కాకుండా జెల్లీ ఫిష్ ఆకారపు పేలుళ్లు లేదా స్తంభంలా కనిపిస్తుందని పేర్కొన్నారు. ‘జస్ట్ వావ్. మేము ఈ ఉదయం మెక్సికో & యూఎస్ మీదుగా వెళ్లినప్పుడు, నేను ఈ స్ప్రైట్‌ను బంధించా’ అని వ్యోమగామి నికోల్ SMలో ఈ చిత్రాన్ని పంచుకోగా వైరలవుతోంది.
News July 5, 2025
ఇన్‌స్టాలో అమ్మాయి, అబ్బాయి ముద్దు వీడియో వైరల్.. తర్వాత..

TG: సోషల్ మీడియాను మిస్ యూస్ చేస్తే అనర్థాలకు దారి తీస్తుందనడానికి ఈ ఘటనో ఉదాహరణ. వరంగల్‌లోని కొత్తవాడకు చెందిన మైనర్ బాలిక, బాలుడు ముద్దు పెట్టుకుంటూ వీడియో తీసుకొని దాన్ని ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేశారు. అది కాస్తా క్షణాల్లో వైరలై ఇరు కుటుంబాల వాళ్లు చూశారు. దీంతో 2 వర్గాలు రోడ్డుపైకి వచ్చి పరస్పరం దాడి చేసుకున్నాయి. ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించడంతో పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు.