News March 31, 2025

CM తలపెట్టిన ‘P4’ గొప్ప ఆలోచన: అనగాని

image

AP: విద్యారంగంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, KG నుంచి PG వరకు కరిక్యులమ్‌లో మార్పులు చేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ‘DSC ద్వారా 16K టీచర్ పోస్టుల భర్తీ చేయబోతున్నాం. CM తలపెట్టిన P4 కార్యక్రమం గొప్ప ఆలోచన’ అని బాపట్ల జిల్లా పర్యటనలో అన్నారు. ఈ సందర్భంగా రేపల్లెలో వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సత్యకుమార్‌ను ఆయన కోరారు.

Similar News

News January 15, 2026

కోకాకోలా $1B ఐపీఓ? క్లారిటీ ఇచ్చిన కంపెనీ

image

హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ (HCCB) IPOపై వస్తున్న వార్తలను ఆ కంపెనీ తోసిపుచ్చింది. ఈ వేసవిలో లేదా సమీప భవిష్యత్తులో అలాంటి ప్లాన్స్ ఏమీ లేవని సంస్థ ప్రతినిధి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాము కేవలం మార్కెట్‌లో పట్టు సాధించడం, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంపైనే ఫోకస్ పెట్టామన్నారు. GST వల్ల లభించిన ధరల ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేస్తున్నామని తెలిపారు. IPO వార్తలన్నీ ఊహాగానాలేనన్నారు.

News January 15, 2026

దేశ భద్రత విషయంలో ముందుంటాం: CM

image

TGలో మరో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఆర్మీ అధికారులను CM రేవంత్ కోరారు. పదేళ్లుగా ఒక్క స్కూలును కూడా మంజూరు చేయలేదన్నారు. సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని HYDకు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దేశ భద్రత అంశాల్లో సహకరించడంలో TG సర్కార్ ముందుంటుందని, లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్‌కు VKDలో 3వేల ఎకరాలు కేటాయించినట్లు HYDలో జరిగిన సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్‌లో గుర్తుచేశారు.

News January 15, 2026

NTVపై చర్యలకు కారణం ఇదేనా?

image

TG: మంత్రి, ఓ మహిళా IAS అధికారికి సంబంధం ఉందని <<18856335>>NTV<<>>, పలు యూట్యూబ్ ఛానళ్లలో వచ్చిన వార్తతో సివిల్ సర్వీస్ అధికారుల సంఘం తీవ్రంగా స్పందించింది. నేరుగా పేరు ప్రస్తావించకపోయినా హోదాలు చెప్పి పరోక్షంగా ఆమె పరువుకు భంగం కలిగించారని ఫిర్యాదు చేసింది. ఆ వార్తను ఏ మాత్రం సహించబోమని స్పష్టం చేయడంతో సర్కారు.. సిట్ ఏర్పాటు చేసి యూట్యూబ్ ఛానళ్లకు నోటీసులు ఇచ్చింది. NTV రిపోర్టర్లను అరెస్టు చేసింది.