News March 31, 2025
ORRపై టోల్ ఛార్జీల పెంపు

TG: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై టోల్ ఛార్జీలను పెంచేశారు. రేపటి నుంచి ఇవి అమలులోకి రానున్నాయి. కారు, జీపు, వ్యాన్, లైట్ మోటార్ వాహనాలకు KMకు 10 పైసలు, మినీ బస్, ఎల్‌సీవీలకు KMకు 20 పైసలు, 2 యాక్సిల్ బస్సులకు 31 పైసలు, భారీ వాహనాలకు 69 పైసల చొప్పున పెంచింది. ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా సంస్థ ఈ ఛార్జీలను వసూలు చేస్తోంది.
Similar News
News April 3, 2025
వక్ఫ్ ఆస్తులపై 2006లోనే రూ.12వేల కోట్ల ఆదాయం: రిజిజు

రాజ్యసభలో వక్ఫ్ సవరణ(UMEED) బిల్లుపై చర్చ కొనసాగుతోంది. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ ‘2006లోనే 4.9లక్షల వక్ఫ్ ప్రాపర్టీస్‌పై రూ.12వేల కోట్ల ఆదాయం వస్తున్నట్లు సచార్ కమిటీ అంచనా వేసింది. ఇప్పుడు 8.72L ఆస్తులున్నాయి. వీటిపై ఎంత వస్తోందో ఊహించుకోండి’ అని వ్యాఖ్యానించారు. ఈ బిల్లు ప్రజల మతపరమైన స్వేచ్ఛలో జోక్యం చేసుకోదని, ఇప్పటికైనా కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు మద్దతు తెలపాలని కోరారు.
News April 3, 2025
భారీ వర్షాలు.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురుస్తున్నాయి. నాగర్‌కర్నూల్(D) పదర(M) కూడన్‌పల్లి సమీపంలో వ్యవసాయ పనులు చేస్తున్న ఇద్దరు మహిళలు పిడుగుపాటుకు గురై మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వర్షాల సమయంలో రైతులు, కూలీలు చెట్ల కింద ఉండకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు పలు జిల్లాల్లో 2 రోజులు భారీ వర్షాలు పడతాయని IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
News April 3, 2025
కంచ గచ్చిబౌలి భూములు.. విచారణ వాయిదా

TG: కంచ గచ్చిబౌలి భూ విచారణను హైకోర్టు ఈ నెల 7కు వాయిదా వేసింది. ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా 400 ఎకరాల భూమిని అమ్మొద్దంటూ పిటిషనర్లు కోర్టును కోరారు.