News March 31, 2025

10 నెలల్లో రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు: లోకేశ్

image

గత 10 నెలల్లో ఏపీకి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి లోకేశ్ తెలిపారు. విశాఖ బీచ్ రోడ్డులో తాజ్ వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన హోటల్, ఆఫీస్ టవర్‌కు తల్లి భువనేశ్వరితో కలిసి భూమిపూజ చేశారు. గత పాలకులు విధ్వంసక విధానాలతో వ్యాపార వాతావరణానికి నష్టం కలిగించారని లోకేశ్ విమర్శించారు. తాము విశాఖను ఐటీ హబ్‌గా మార్చి రాబోయే ఐదేళ్లలో యువతకు 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Similar News

News April 3, 2025

‘HIT-3’ సినిమా క్లైమాక్స్‌లో కార్తీ?

image

నేచురల్ స్టార్ నాని హీరోగా శైలేశ్ కొలను తెరకెక్కిస్తోన్న ‘HIT-3’కి సంబంధించిన క్రేజీ న్యూస్ SMలో చక్కర్లు కొడుతోంది. HIT, HIT-2 క్లైమాక్స్‌లో కొత్త హీరోను పరిచయం చేస్తూ సీక్వల్స్‌పై భారీ అంచనాలు పెంచిన విషయం తెలిసిందే. HIT-3లోనూ మరో స్టార్ హీరో నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రంలో తమిళ హీరో కార్తీ క్లైమాక్స్‌లో కనిపిస్తారని సినీవర్గాల్లో టాక్ నడుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

News April 3, 2025

మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నా: మల్‌రెడ్డి

image

TG: క్యాబినెట్ విస్తరణలో తనకు అవకాశం దక్కుతుందని ఇబ్రహీంపట్నం MLA మల్‌రెడ్డి రంగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో AICC అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీని కలిసి అవకాశం ఇవ్వాలని కోరారు. గతంలో HYD-రంగారెడ్డి జిల్లాల నుంచి చాలామంది మంత్రులు ఉండేవారని, తనకు పదవి ఇవ్వడం ద్వారా RR జిల్లాకు పదవి దక్కినట్లు అవుతుందన్నారు. తనకు ఇవ్వకపోయినా జిల్లాలో ఏదో ఒక సామాజికవర్గానికి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

News April 3, 2025

ఆ ఫొటోగ్రాఫర్‌ను పట్టిస్తే రూ.10 లక్షలిస్తాం: కాంగ్రెస్ నేత

image

HCU భూములను జేసీబీలు చదును చేస్తుంటే అక్కడే ఉన్న జింకలు, నెమళ్లు పరుగులు తీసిన ఫొటోను సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. అయితే, ఇది ఏఐ ఎడిటెడ్ ఫొటో అని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి ఇంత గొప్ప ఫొటోను తీసిన వ్యక్తిని గుర్తించి తమకు పట్టిస్తే రూ.10 లక్షలు రివార్డ్ ఇస్తామని సెటైరికల్ ట్వీట్ చేశారు.

error: Content is protected !!