News March 31, 2025

మత సామరస్యానికి ప్రతీక రంజాన్: పరిగి ఎమ్మెల్యే

image

రంజాన్ పండుగను పురస్కరించుకుని పరిగి పట్టణ కేంద్రంలోని ఈద్గా వద్ద కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి  ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పవిత్రతకు, త్యాగానికి, మత సామరస్యానికి రంజాన్ ప్రతీకగా నిలుస్తోందని అన్నారు.

Similar News

News April 3, 2025

విశాఖ: భర్త దాడిలో భార్య మృతి

image

విశాఖలో వివాహిత రమాదేవి చికిత్స పొందుతూ మృతిచెందింది. మాధవధారకు చెందిన రమాదేవి, బంగార్రాజు మధ్య గొడవలు జరగ్గా రమాదేవి పుట్టింటికి వెళ్లింది. గతనెల 30న బంగార్రాజు అక్కడికి వెళ్లి గొడవపడ్డాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బయలుదేరగా అడ్డగించి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను KGHకి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. నిందితుడిని టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

News April 3, 2025

మూసీకి పూడిక ముప్పు..!

image

మూసీ జలాశయానికి పూడిక ముప్పు ముంచుకొస్తోంది. సీడబ్లూసీ గతేడాది నిర్వహించిన సర్వే మూసీకి పూడిక ముప్పును గుర్తించింది. ప్రాజెక్ట్ నిర్మించిన తొలినాళ్లలో నాలుగు నియోజకవర్గాల్లోని 42 వేల ఎకరాలకు పైగా సాగు నీరు, సూర్యాపేట పట్టణానికి తాగునీరు అందించింది. పూడిక పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గి నేడు 30 వేల ఎకరాలకు కూడా సాగు నీటిని అందించలేని దుస్థితికి చేరుకుంది.

error: Content is protected !!