News March 31, 2025
కోనసీమ జిల్లాలో ఏప్రిల్ 2నుంచి ఉచిత కోచింగ్

జిల్లాలో ఏప్రిల్ 2 నుంచి రాష్ట్ర బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ ప్రారంభమవుతుంది. ఆలమూరు, కొత్తపేట, కాట్రేనికోన, అంబాజీపేట, పి.గన్నవరం, మామిడికుదురు, రాజోలు, మలికిపురం మండలాల్లో కోచింగ్ ఇస్తామని జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి సుబ్బరాజు సోమవారం తెలిపారు. పాలిటెక్నిక్, APRJC, స్పోకెన్ ఇంగ్లీష్, కెరీర్ గైడెన్స్‌పై పదవ తరగతి విద్యార్థులకు శిక్షణ ఇస్తారు.
Similar News
News April 3, 2025
NGKL: పిడుగుపాటుకు చనిపోయింది వీళ్లే!

నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలంలో పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. వేరుశనగ పొలాల్లో కూలీ పనులకు వెళ్లిన సమయంలో వచ్చిన భారీ వర్షంలో పిడుగు పడటంతో మండలంలోని కోడోనిపల్లి ప్రాంతానికి చెందిన సుంకరి సైదమ్మ (35), వీరమ్మ (55) అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళ సుంకరి లక్ష్మమ్మ గాయపడగా ఆమెను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News April 3, 2025
HCU విద్యార్థులపై కేసులను ఎత్తివేస్తాం: భట్టి

TG: HCUకు సంబంధించిన భూమిని ఇంచుకూడా ప్రభుత్వం తీసుకోదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని ఢిల్లీలో తెలిపారు. వారిపై దుందుడుకుగా వ్యవహరించవద్దని పోలీసులను ఆదేశించారు. గతంలో బిల్లీరావుకు చంద్రబాబు అప్పనంగా 400 ఎకరాలు కట్టబెడితే నాటి సీఎం వైఎస్సార్ ఆ భూములను కాపాడారని చెప్పారు.
News April 3, 2025
VZM: ఈనెల 10 నుంచి ఉచిత కుట్టు శిక్షణ

విజయనగరం జిల్లాలోని షెడ్యూల్డు కులాలకు చెందిన అభ్యర్ధులకు ఈనెల 10వ తేదీ నుంచి నగరంలో ఉచిత కుట్టు శిక్షణ అందించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ గురువారం తెలిపారు. నాక్ ఆధ్వర్యంలో వీటీ అగ్రహారంలో నిర్వహిస్తున్న స్కిల్ హబ్‌లో ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. SC వర్గానికి చెందిన 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలు, పురుషులు అర్హులని పేర్కొన్నారు.