News March 31, 2025

MBNR: పండుగ రోజు LRS కోసం ఎవరూ రాలే..! 

image

ఎల్ఆర్ఎస్ కోసం ప్రభుత్వం ప్రకటించిన 25% రాయితీ నేటితో ముగియనుంది. పండుగ రోజును సైతం లెక్కచేయకుండా మహబూబ్‌నగర్ నగరపాలిక సంస్థ అధికారులు కార్యాలయాన్ని తెరిచి ఉంచినా దరఖాస్తుదారులు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. పట్టణంలో 31,190 దరఖాస్తులు రాగా ఇప్పటివరకు కేవలం 1,800 మాత్రమే పరిష్కారమయ్యాయి. మిగిలిన వారు ఏమాత్రం స్పందించడం లేదు. 

Similar News

News September 11, 2025

MBNR: వాకిటి శ్రీహరికి హోంశాఖ ఇవ్వాలి- శ్రీనివాస్ గౌడ్

image

వాకిటి శ్రీహరికి ప్రాధాన్యంలేని మత్స్యశాఖ కట్టబెట్టి నిధులు ఇవ్వడంలేదని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. రెవెన్యూ లేదా హోంశాఖ కేటాయిస్తే బాగా పనిచేస్తారన్నారు. గురువారం HYDలోని తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. ముదిరాజ్‌లను బీసీ ఏ గ్రూప్‌లో చేరుస్తామని మోసం చేస్తున్నారన్నారు. CM, పీసీసీ ప్రెసిడెంట్ చర్చించి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలకు GO ఇవ్వాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.

News September 11, 2025

MBNR: పశువుల దొంగల అరెస్టు.. రూ.14.50 లక్షలు స్వాధీనం

image

MBNR(D) నవాబ్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పశువుల దొంగతనాలు చేసిన నలుగురు నిందితులను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. ఈ నెల 2న కేసు నమోదు అయిందన్నారు. నవాబ్‌పేట్ పోలీసులు కన్మన్ కల్వ గ్రామ శివారులో నేడు పెట్రోలింగ్ చేస్తుండగా.. అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను, బొలెరో వాహనం అదుపులోకి తీసుకున్నామన్నారు. రూ.14,50,000 విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

News September 11, 2025

భారీ వర్షం.. జానంపేటలో అత్యధికం

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గడచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మూసాపేట మండలంలోని జానంపేటలో అత్యధికంగా 42.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అడ్డాకులలో 33.5, దేవరకద్రలో 31.5, చిన్నచింతకుంటలో 22.0, మహమ్మదాబాద్‌లో 11.0, కోయిలకొండలో 4.5, మహబూబ్‌నగర్ అర్బన్‌లో 3.5, కౌకుంట్లలో 1.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.