News March 31, 2025
BREAKING: కిష్టాపురంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

సూర్యాపేట జిల్లా చింతలపాలెం కిష్టాపురంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సభకు కార్యాకర్తలను తరలించే విషయంలో ఇద్దరి మధ్యా ఘర్షణ తలెత్తినట్లు స్థానికులు తెలిపారు. ఇరువర్గాల మధ్య జరిగిన ఈ ఘర్షణలో పలు బైకులు, ఇళ్లలోని ఫర్నిచర్ ధ్వంసమైయ్యాయి. ఐదుగురు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. దీంతో గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
Similar News
News April 3, 2025
తెలంగాణలో తొలి ట్రాన్స్‌జెండర్ ట్రాఫిక్ మార్షల్స్

సైబరాబాద్‌లో జరీనా, విశాలాక్షి, అనూష, ప్రభ, వాసుప్రియ తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ ట్రాఫిక్ మార్షల్స్‌గా నియమితులయ్యారు. డీసీపీ సృజన కర్నం ఆధ్వర్యంలో ఎంపిక జరిగిందని, ట్రాన్స్‌జెండర్ హక్కుల కోసం పోరాటం కొనసాగాలని ఆక్టివిస్ట్ చంద్రముఖి మువ్వలా అన్నారు. ప్రభుత్వ శాఖల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.
News April 3, 2025
ఎలక్ట్రానిక్ పరికరాల బహిరంగ వేలం

రాచకొండ కమిషనరేట్ పరిధి అంబర్‌పేటలోని CAR పరేడ్ గ్రౌండ్, హెడ్ క్వార్టర్స్‌లో వస్తువులను బహిరంగ వేలం నిర్వహించాలని రాచకొండ కమిషనరేట్ నిర్ణయించింది. టేబుల్స్, కుర్చీలు, UPS బ్యాటరీలు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, బారికేడ్‌లు, రిఫ్లెక్టివ్ జాకెట్లు, బొల్లార్డ్‌లు మొదలైన వస్తువులను సొంతం చేసుకోవాలనుకున్నవారు. ఈ నెల 4న ఉ.10.30 గంటలకు వేలంలో పాల్గొనవచ్చు. # SHARE IT
News April 3, 2025
ఏటూరునాగారం: 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు

ఇటీవల విడుదలైన జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లికి చెందిన అజారుద్దీన్ జూనియర్ లెక్చరర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. గతంలో విడుదలైన టీజీటీ, పీజీటీ, గురుకులం జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు సైతం సాధించినట్లు తెలిపారు. 4 ఉద్యోగాలు సాధించగా అందులో జూనియర్ లెక్చరర్ (గెజిటెడ్) ఉద్యోగంలో చేరినట్లు పేర్కొన్నాడు. కాగా, అజారుద్దీన్‌ను స్థానికులు ఘనంగా సత్కరించారు.