News March 31, 2025
వనపర్తి జిల్లాలో 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా..

వనపర్తి జిల్లాలో 20 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. అత్యధికంగా దగడ, వెలుగొండలో 40.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెబ్బేరు 40.4, రేమోద్దుల 40.3, ఆత్మకూరు 40.1, పానగల్ 39.7, శ్రీరంగాపూర్ 39.7, కానాయిపల్లి 39.6, జానంపేట 39.6, విలియంకొండ 39.5, వీపనగండ్ల 39.5, సోలిపూర్ 39.1, గోపాల్‌పేట 39.1, అమరచింత 39.1, మదనాపూర్ 38.9 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News April 3, 2025
అన్నమయ్య జిల్లాలో క్షుద్ర పూజల కలకలం

గుర్రంకొండలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గుర్రంకొండలోని ఇందిరమ్మ, జగనన్న కాలనీలలో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే గుప్తనిధుల కోసం తవ్వకాలు కూడా జరుపుతున్నట్లు ఆరోపించారు. ఎస్ఐ మధు చంద్రుడు మాట్లాడుతూ.. ఆయా కాలనీలలో పోలీసు నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
News April 3, 2025
ముస్లిం విద్యార్థులకు ఉచిత విద్య

AP: రాష్ట్రంలోని ముస్లిం విద్యార్థులకు ఇంటర్మీడియట్‌తోపాటు జేఈఈ, నీట్‌కు ఉచిత విద్య అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెన్త్ పాసైనవారికి టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఇందులో మెరిట్ సాధించిన విద్యార్థులకు ఎంపిక చేసిన కార్పొరేట్ కళాశాలలో వారు కోరుకున్న కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. దీనికయ్యే ఖర్చును వక్ఫ్ బోర్డు భరించనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది.
News April 3, 2025
విశాఖ: భర్త దాడిలో భార్య మృతి

విశాఖలో వివాహిత రమాదేవి చికిత్స పొందుతూ మృతిచెందింది. మాధవధారకు చెందిన రమాదేవి, బంగార్రాజు మధ్య గొడవలు జరగ్గా రమాదేవి పుట్టింటికి వెళ్లింది. గతనెల 30న బంగార్రాజు అక్కడికి వెళ్లి గొడవపడ్డాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బయలుదేరగా అడ్డగించి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను KGHకి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. నిందితుడిని టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.