News March 31, 2025

అనకాపల్లి జిల్లాలో సోషల్ పరీక్షకు 11,700 మంది: డీఈవో

image

అల్లూరి జిల్లాలో మంగళవారం జరగనున్న సోషల్ స్టడీస్ పరీక్ష జిల్లాలో 71 కేంద్రాల్లో జగనుందని డీఈవో బ్రహ్మాజీరావు తెలిపారు. మొత్తం 11,700 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు వెల్లడించారు. మంగళవారం పాఠశాలలకు ఆప్షనల్ హాలిడే ప్రకటించినప్పటికీ పది పరీక్ష యథావిధిగా జరుగుతుందన్నారు. పరీక్ష సమయం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45  గంటల వరకు ఉంటుంది.. అరగంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. 

Similar News

News April 3, 2025

NLG: ఆర్మీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ తెలిపారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్, ట్రేడ్‌మెన్ పోస్టులు ఉన్నాయన్నారు. ITI, డిప్లొమా, NCC కలిగిన వారికి బోనస్ మార్కులు ఉంటాయని పేర్కొన్నారు. www. joinindianarmy.nic. వెబ్‌సైట్‌లో ఈ నెల 10 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 04027740205 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

News April 3, 2025

జియ్యమ్మవలస మండలంలో ఏనుగులు గుంపు సంచారం

image

పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు ఏనుగుల గుంపు నుంచి తిప్పలు తప్పడం లేదు. కురుపాం నియోజకవర్గాల్లో సంచరిస్తూ రైతులను, ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. గురువారం ఉదయం కూడా జియ్యమ్మవలస నిమ్మలపాడు ప్రాంతాల్లోని చెరుకు, అరటి, పామాయిల్ తోటల్లో తిరుగుతున్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. పొలాలకు వెళ్లే రైతులు, అటుగా ప్రయాణాలు చేసే వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

News April 3, 2025

కడప జిల్లాలో యూట్యూబర్స్‌పై కేసు నమోదు

image

ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో ఇద్దరు యూట్యూబర్స్‌పై కేసు నమోదు అయింది. సీఐ హేమ సుందర్ తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన శంకర్ రాజు, సత్యనారాయణ రెడ్డి అనే యూట్యూబర్స్, జర్నలిస్ట్ సుబ్రహ్మణ్యం డబ్బుల కోసం బెదిరించారని పోలీసులకు కోడూరు రేంజ్ పీఏ శ్యాంసుందర్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.

error: Content is protected !!