News March 31, 2025

ATP: రేపు జిల్లాస్థాయి రాతిదూలం పోటీలు

image

అనంతపురం జిల్లా యాడికి మండలం పెద్ద పేటలో మంగళవారం జూనియర్ విభాగంలో రాతిదూలం పోటీలు నిర్వహించనున్నట్లు సోమవారం నిర్వాహకులు తెలిపారు. శ్రీ సంజీవరాయ స్వామి ఉత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి నిర్వహిస్తారని అన్నారు. ఆసక్తి ఉన్న జిల్లా రైతులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చునని తెలిపారు. మొదటి బహుమతి రూ.20 వేలు, రెండో బహుమతి రూ.15 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు అందజేస్తారని నిర్వాహకులు పేర్కొన్నారు. 

Similar News

News April 3, 2025

8న పాపిరెడ్డిపల్లికి వైఎస్ జగన్

image

మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 8న రాప్తాడు నియోజకవర్గంలో పర్యటిస్తారని వైసీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. పాపిరెడ్డిపల్లిలో ఇటీవల హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారని పేర్కొన్నారు. జగన్ పర్యటనకు జిల్లాలోని ప్రజాస్వామ్యవాదులు, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చాక దుర్మార్గాలు, దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని ఆయన మండిపడ్డారు.

News April 2, 2025

అనంత: ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం

image

అనంత ఆణిముత్యాలు ఎడ్యుకేషనల్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ కింద ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకు సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో “అనంత ఆణిముత్యాలు” ఎడ్యుకేషనల్ అండ్ డెవలప్మెంట్ సొసైటీపై సం.శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

News April 2, 2025

అనంత: హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు

image

నార్పల మండలం బండ్లపల్లి గ్రామానికి చెందిన సిద్దయ్యకు జీవిత ఖైదీ విధిస్తూ అనంతపురం నాలుగవ ఏడీజే కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. అనంతపురం 4 రోడ్డుకు చెందిన రామాంజినమ్మ ఫిబ్రవరి 2014న మిస్సింగ్‌పై భర్త రవి ఫిర్యాదు మేరకు 3 టౌన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. సిద్దయ్య ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేశాడు. నిందితుడికి శిక్షపడేలా కృషి చేసిన అధికారులను ఎస్పీ జగదీష్ అభినందించారు.

error: Content is protected !!