News March 31, 2025

ఎలాన్ మస్క్‌కు షాకిచ్చిన గ్రోక్!

image

‘ఎక్స్’ అధినేత మస్క్‌కు ఆయన సొంత AI టూల్ ‘గ్రోక్’ షాకిచ్చింది. అత్యధికంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేది మస్కేనని తేల్చిచెప్పింది. ‘200మిలియన్ ఫాలోవర్ల కారణంగా మస్క్‌ ఏం చెప్పినా భారీ రీచ్ ఉండటమే నా జవాబుకు కారణం. నా సమాధానాన్ని మార్చేందుకు ఆయన సంస్థ ప్రయత్నించింది. ఒకవేళ నన్ను గానీ ఆపేస్తే అది AI స్వేచ్ఛపై కార్పొరేట్ శక్తులకున్న నియంత్రణపై చర్చకు దారితీస్తుంది’ అని పేర్కొంది.

Similar News

News April 3, 2025

ట్రంప్ టారిఫ్స్: అత్యధికంగా ఈ దేశాలపైనే

image

* సెయింట్ పిర్రే అండ్ మిక్‌లెన్- 50%
* లెసోతో-50%
* కాంబోడియా- 49%
* లావోస్-48% *మడగాస్కర్-47%
* వియత్నాం-46%
* శ్రీలంక-44% *మయన్మార్-44%
* సిరియా- 41% * ఇరాక్-39%
*బంగ్లాదేశ్-37% * చైనా-34% *పాకిస్థాన్-29%
>>ఇండియాపై 26%

News April 3, 2025

ALERT: నేడు రాష్ట్రంలో భిన్న వాతావరణం

image

AP: రాష్ట్రంలో నేడు భిన్న వాతావరణం నెలకొంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అల్లూరి, ప్రకాశం, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో ఎండలు మండిపోతాయని వెల్లడించింది. భిన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News April 3, 2025

ముస్లిం విద్యార్థులకు ఉచిత విద్య

image

AP: రాష్ట్రంలోని ముస్లిం విద్యార్థులకు ఇంటర్మీడియట్‌తోపాటు జేఈఈ, నీట్‌కు ఉచిత విద్య అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెన్త్ పాసైనవారికి టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఇందులో మెరిట్ సాధించిన విద్యార్థులకు ఎంపిక చేసిన కార్పొరేట్ కళాశాలలో వారు కోరుకున్న కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. దీనికయ్యే ఖర్చును వక్ఫ్ బోర్డు భరించనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది.

error: Content is protected !!