News March 31, 2025
ఆదిలాబాద్: 13వ రోజుకు చేరుకున్న దీక్ష

ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్ష 13వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు పలు యువజన నాయకులు, వివిధ సంఘాల నేతలు మద్దతు తెలిపారు. సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి సీసీఐ పునరుద్ధరణకు కృషి చేయాలని కోరారు.
Similar News
News April 6, 2025
టాప్ 10లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్రంలో పీపుల్స్ పల్స్ నిర్వహించిన సర్వేలో టాప్ టెన్ ఎమ్మెల్యేల్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చోటు సంపాదించుకున్నారు. పీపుల్స్ పల్స్ సంస్థ సౌత్ ఫస్ట్ వెబ్ ద్వారా 2024 మార్చి 28 నుంచి ఏప్రిల్ 3 వరకు ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేశారు. ఇందులో ఆదిలాబాద్ ఎమ్మెల్యే 8వ స్థానంలో నిలిచారు. నియోజకవర్గంలో 450 నుంచి 500 శాంపిల్స్ సేకరించినట్టు సంస్థ తెలిపింది.
News April 6, 2025
ADB: పాలిటెక్నిక్‌లో ప్రవేశాలకు POLYCET

పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు పాలిసెట్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆదిలాబాద్ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ బండి రాంబాబు తెలిపారు. ఏప్రిల్ 20లోగా దరఖాస్తు చేసుకోవాలని, మే 13న పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. పదోతరగతి పూర్తయిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News April 6, 2025
శిక్షలు పడేవిధంగా ప్రతి ఒక్కరు పని చేయాలి: ADB ఎస్పీ

కోర్టులలో నేరస్తులకు సరైన సమయంలో సరైన శిక్ష పడేవిధంగా ప్రతి ఒక్క కోర్టు డ్యూటీ అధికారి పని చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. శనివారం ఆదిలాబాద్ పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో కోర్టు డ్యూటీ అధికారులు, లైసెన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎఫ్ఐఆర్ నమోదైన సందర్భం నుంచి కేసు పూర్తి అయ్యేవరకు ప్రతి ఒక్క అంశాన్ని కోర్టు డ్యూటీ అధికారులు పరిశీలించాలన్నారు.