News March 31, 2025

SRHకు వేధింపులు.. సీఎం ఆగ్రహం

image

TG: పాసుల కోసం SRH యాజమాన్యాన్ని HCA <<15934651>>వేధింపులకు<<>> గురిచేసిన వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే వివరాలను సేకరించిన ఆయన దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. దర్యాప్తు తర్వాత కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు.

Similar News

News April 4, 2025

KGBVల్లో ప్రవేశాలు.. ఈ నెల 11 వరకు ఛాన్స్

image

AP: రాష్ట్రంలోని 352 KGBVల్లో ఆరో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలకు ఈ నెల 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 7, 8, 9, 10, ఇంటర్ సెకండియర్‌లో మిగిలిన సీట్లకు అప్లై చేసుకోవాలని సమగ్రశిక్ష సంచాలకులు శ్రీనివాసరావు సూచించారు. అనాథలు, డ్రాపౌట్స్, SC, ST, BC, మైనార్టీ బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వెబ్‌సైట్: https://apkgbv.apcfss.in/

News April 4, 2025

గతేడాది అత్యధికంగా అమ్ముడైన కారు ఇదే..

image

గత ఆర్థిక సంవత్సరం ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన వెహికిల్‌గా మారుతీ సుజుకీ వేగన్-R నిలిచింది. 1,98,451 యూనిట్లు విక్రయించినట్లు సంస్థ ప్రకటించింది. దేశంలో ఇప్పటివరకు మెుత్తం 33.7 లక్షల యూనిట్లు సేల్ చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆటో మెుబైల్ మార్కెట్‌లో Wagon-R 4th జెనరేషన్ వెహికిల్ 9 వేరియంట్లలో అందుబాటులో ఉంది.

News April 4, 2025

పాపం.. అలోవెరా జ్యూస్ అనుకొని తాగి..

image

అలోవేరా జ్యూస్ అనుకొని పురుగుల మందు తాగి 14 ఏళ్ల బాలిక మరణించింది. బెంగళూరుకు చెందిన దీపాంజలికి అలోవెరా జ్యూస్ తాగే అలవాటు ఉంది. ఎప్పటిలాగే ఇంట్లో ఉన్న బాటిల్‌ తీసుకొని తాగేసింది. అయితే అంతకుముందే అందులో జ్యూస్ అయిపోవడంతో పేరెంట్స్ ఆ డబ్బాలో పురుగుల మందు లిక్విడ్ పోసి పెట్టారు. అది గమనించకపోవడంతో దీపాంజలి తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.

error: Content is protected !!