News March 26, 2024

ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాసులురెడ్డి?

image

AP: ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డినే బరిలోకి దింపాలని ఆ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తొలుత ఈ స్థానానికి శ్రీనివాసులు రెడ్డితో పాటు ఆయన కుమారుడు రాఘవరెడ్డి అభ్యర్థిత్వాన్ని కూడా TDP పరిశీలించింది. అయితే తన తండ్రే పోటీ చేస్తారని రాఘవరెడ్డి నిన్న ప్రకటించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు తీవ్రత పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. రాఘవ ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు.

Similar News

News November 4, 2025

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కమిటీ

image

TG: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ సంస్కరణలకు ప్రభుత్వం కమిటీని నియమించింది. స్పెషల్ సీఎస్ ఛైర్మన్‌గా, ప్రిన్సిపల్ సెక్రటరీ వైస్ ఛైర్మన్‌గా 15 మందితో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కాలేజీ యాజమాన్యాల నుంచి ముగ్గురికి, ప్రొఫెసర్లు కంచ ఐలయ్య, కోదండరామ్‌కు చోటు కల్పించింది. రీయింబర్స్‌మెంట్ విధానంపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. తీసుకోవాల్సిన చర్యలపై 3 నెలల్లో తమ రిపోర్టును ప్రభుత్వానికి అందజేయనుంది.

News November 4, 2025

ఇతిహాసాలు క్విజ్ – 56 సమాధానాలు

image

1. కౌరవ, పాండవుల గురువైన ద్రోణాచార్యుడి ‘పరుశరాముడు’.
2. మేఘనాదుడు ‘తమ కుటుంబ దేవత అయిన నికుంభి’లను పూజించడం వల్ల ఇంద్రజిత్ అయ్యాడు.
3. నవ విధ భక్తి మార్గాలలో మొదటిది ‘శ్రవణం’.
4. ప్రతి మాసంలో వచ్చే పన్నెండో తిథి పేరు ‘ద్వాదశి’.
5. సీత స్వయంవరం లో ఉన్న శివ ధనుస్సు అసలు పేరు ‘పినాక’.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 4, 2025

వరల్డ్‌కప్ విజేతలు విక్టరీ పరేడ్‌కు దూరం

image

ICC ఉమెన్స్ వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు విక్టరీ పరేడ్‌‌కు దూరం కానుంది. ఈ మేరకు BCCI ప్రకటించింది. ఈ ఏడాది IPL కప్ విజేత RCB చేపట్టిన పరేడ్‌లో తొక్కిసలాట జరిగి ఫ్యాన్స్ మరణించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రతా కారణాలతో ర్యాలీ చేపట్టడం లేదని చెబుతున్నారు. రేపు ఢిల్లీలో PM చేతుల మీదుగా టీమ్‌ ఇండియాను సన్మానిస్తారు. తొలిసారి ఉమెన్ వరల్డ్‌కప్ గెలిచినా పరేడ్ లేకపోవడంపై విమర్శలొస్తున్నాయి.