News March 31, 2025
బలూచిస్థాన్‌లో భూకంపం

వరుస భూకంపాలు మానవాళిని భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తాజాగా పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.6గా నమోదైంది. కరాచీలోనూ భూప్రకంపనలు కనిపించాయి. బలూచిస్థాన్‌కు 65కి.మీ దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇవాళ మధ్యాహ్నం భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌లో <<15949405>>భూకంపం<<>> వచ్చిన విషయం తెలిసిందే.
Similar News
News April 3, 2025
‘అమరావతి’కి తొలి విడత రుణం.. ఖాతాలో రూ.3,535 కోట్లు జమ

AP: రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు తొలి విడతలో రూ.3,535 కోట్ల రుణం మంజూరు చేసింది. ఈ నిధులు ఇవాళ ప్రభుత్వ ఖాతాలో జమయ్యాయి. త్వరలోనే ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు(ADB) నుంచీ తొలి విడత రుణం మంజూరవుతుందని ప్రభుత్వ పెద్దలు తెలిపారు. రాజధాని కోసం ప్రపంచ బ్యాంకు, ADB రూ.6,700 కోట్లు చొప్పున రుణం ఇస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కూడా రూ.1,400 కోట్లు ప్రత్యేక సాయంగా అందిస్తోంది.
News April 3, 2025
నేడు రాజ్యసభ ముందుకు వక్ఫ్ బిల్లు

వక్ఫ్ సవరణ బిల్లు 12 గంటల సుదీర్ఘ చర్చల అనంతరం లోక్‌సభ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. నేడు చర్చ, ఆమోదం కోసం బిల్లు రాజ్యసభ ముందుకు రానుంది. అక్కడ ఎన్డీఏకు 125 మంది సభ్యుల బలం ఉండడంతో పాస్ అవ్వడం లాంఛనమే. ముస్లిం సంఘాలు, విపక్ష పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైనా కేంద్రం వెనక్కి తగ్గలేదు. ట్రిపుల్ తలాఖ్ రద్దు, సిటిజన్‌షిప్ యాక్ట్, యూనిఫామ్ సివిల్ కోడ్ విషయాల్లోనూ విమర్శలు వచ్చినా ముందుకు సాగింది.
News April 3, 2025
ట్రంప్ టారిఫ్స్: అత్యధికంగా ఈ దేశాలపైనే

* సెయింట్ పిర్రే అండ్ మిక్‌లెన్- 50%
* లెసోతో-50%
* కాంబోడియా- 49%
* లావోస్-48% *మడగాస్కర్-47%
* వియత్నాం-46%
* శ్రీలంక-44% *మయన్మార్-44%
* సిరియా- 41% * ఇరాక్-39%
*బంగ్లాదేశ్-37% * చైనా-34% *పాకిస్థాన్-29%
>>ఇండియాపై 26%