News March 31, 2025
అనకాపల్లి-అచ్యుతాపురం రోడ్డు పనులకు శంకుస్థాపన

అనకాపల్లి-అచ్యుతాపురం రహదారి విస్తరణ పనులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం సాయంత్రం అచ్యుతాపురం వద్ద శంకుస్థాపన చేశారు. రూ.243 కోట్లతో నాలుగు లైన్ల రహదారితో పాటు ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. 13.8 కిలోమీటర్ల పొడవునా నాలుగులైన్ల రహదారిగా విస్తరించనున్నారు. అచ్యుతాపురం మండలం మోసయ్యపేటలో ఫ్లైఓవర్‌ను నిర్మిస్తారు. శంకుస్థాపన అనంతరం మంత్రి లోకేశ్ విశాఖ విమానాశ్రయానికి వెళ్లారు.
Similar News
News April 3, 2025
పార్వతీపురం: బీసీ కార్పొరేషన్ రుణాలకు రేపు బ్యాంకర్ల ఇంటర్వ్యూలు

బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తుదారులకు ఈ నెల 4న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. పార్వతీపురంలోని మెప్మా కార్యాలయంలో పలు బ్యాంకుల అధికారులు పాల్గొని ఇంటర్వ్యూలు చేస్తారని పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 15 సచివాలయాల నుంచి 968 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.
News April 3, 2025
SRPT: ఆర్మీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి తెలిపారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్, ట్రేడ్‌మెన్ పోస్టులు ఉన్నాయన్నారు. ఐటీఐ, డిప్లొమా, ఎన్‌సీసీ కలిగిన వారికి బోనస్ మార్కులు ఉంటాయని పేర్కొన్నారు. www. joinindianarmy.nic.వెబ్‌సైట్‌లో ఈ నెల 10 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 04027740205 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
News April 3, 2025
చోడవరం: చెట్టు పైనుంచి జారిపడి మృతి

చోడవరం మండలం నరసయ్యపేట గ్రామ శివారు ప్రాంతంలో బుధవారం సాయంత్రం కల్లు తీయటానికి తాటి చెట్టు ఎక్కిన కల్లుగీత కార్మికుడు మేడిశెట్టి నూకరాజు (30) ప్రమాదవశాత్తు జారిపడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నూకరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. అటుగా వెళుతున్న రైతులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చోడవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.