News March 31, 2025
ధోనీ మ్యాచ్ విన్నర్ కాదు.. ఈ గణాంకాలే నిదర్శనం: విశ్లేషకులు

క్రికెట్‌లో ధోనీ బెస్ట్ ఫినిషర్. అతను చివరి వరకు క్రీజులో ఉంటే గెలుపు ఖాయమనే మాటలకు ఇక కాలం చెల్లినట్లే. అతని IPL గణాంకాలే ఇందుకు నిదర్శనం. 2023 నుంచి ఇప్పటి వరకు ఛేజింగ్ చేస్తూ జట్టు గెలిచిన సందర్భాల్లో అతను 3 మ్యాచ్‌లలో 3 రన్స్(9 బాల్స్) మాత్రమే చేశారు. ఓడిన గేమ్స్‌లో 6 Innsలలో 166 రన్స్(84 బంతులు) చేశారు. దీన్నిబట్టి టీమ్ విజయాల్లో ధోనీ పాత్ర ఏమీ లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మీరేమంటారు?
Similar News
News April 3, 2025
ట్రంప్ టారిఫ్స్: అత్యధికంగా ఈ దేశాలపైనే

* సెయింట్ పిర్రే అండ్ మిక్‌లెన్- 50%
* లెసోతో-50%
* కాంబోడియా- 49%
* లావోస్-48% *మడగాస్కర్-47%
* వియత్నాం-46%
* శ్రీలంక-44% *మయన్మార్-44%
* సిరియా- 41% * ఇరాక్-39%
*బంగ్లాదేశ్-37% * చైనా-34% *పాకిస్థాన్-29%
>>ఇండియాపై 26%
News April 3, 2025
ALERT: నేడు రాష్ట్రంలో భిన్న వాతావరణం

AP: రాష్ట్రంలో నేడు భిన్న వాతావరణం నెలకొంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అల్లూరి, ప్రకాశం, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో ఎండలు మండిపోతాయని వెల్లడించింది. భిన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News April 3, 2025
ముస్లిం విద్యార్థులకు ఉచిత విద్య

AP: రాష్ట్రంలోని ముస్లిం విద్యార్థులకు ఇంటర్మీడియట్‌తోపాటు జేఈఈ, నీట్‌కు ఉచిత విద్య అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెన్త్ పాసైనవారికి టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఇందులో మెరిట్ సాధించిన విద్యార్థులకు ఎంపిక చేసిన కార్పొరేట్ కళాశాలలో వారు కోరుకున్న కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. దీనికయ్యే ఖర్చును వక్ఫ్ బోర్డు భరించనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది.