News March 31, 2025

నెల్లూరు : ఈ రోజు రాత్రి 12 గంటల వరకే..

image

ధాన్యం కొనుగోలు కార్యకలాపాలు సోమవారం అర్ధరాత్రితో ముగియనుందని జాయింట్ క‌లెక్ట‌ర్ కార్తీక్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు మధ్యాహ్నం ఒంటి గంట తరువాత యథావిధిగా రబీ సీజన్‌కు సంబంధించి కొనుగోలు ప్రక్రియ ప్రారంభించ బడుతుందన్నారు. ఈ విషయాన్ని రైతులందరికీ తెలియజేసి ఏ విధమైన అంతరాయం లేకుండా అధికారులు చూడాలని సూచించారు.

Similar News

News April 3, 2025

కాకాణి నువ్వెక్కడ..?: అజీజ్

image

మాజీ మంత్రి కాకాణి ఎక్కడ ఉన్నారు..? పోలీసులకు చిక్కకుండా ఎన్ని రోజులని దాక్కుంటారని రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అజీజ్ ప్రశ్నించారు. తప్పులు చేయడం, పరారవడం మీకు(వైసీపీ) అలవాటే కదా అన్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పే మాటలు, చేసే పనులకు ఎప్పుడూ పొంతన ఉండదని విమర్శించారు. పొదలకూరు మండలం తాటిపర్తి పంచాయతీ వరదాపురం రుస్తుం మైన్ వేదికగా కాకాణి గతంలో చేసిన పాపాలే ఇప్పుడు శాపాలై వెంటాడుతున్నాయన్నారు.

News April 3, 2025

ముస్లింలకు ఉచిత విద్య: అబ్దుల్ అజీజ్

image

నెల్లూరుకు చెందిన టీడీపీ నేత, ఏపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ శుభవార్త చెప్పారు. ముస్లింలకు ఉచిత విద్య అందించేందుకు త్వరలో నూతన పథకాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. పథకం వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. వక్ఫ్ ఆస్తుల అద్దెల సవరణకు రెంట్ రివ్యూ కమిటీని నియమించామని తెలిపారు. ఈ మేరకు ఏపీ వక్ఫ్ బోర్డ్ కార్యాలయంలో సమావేశమై పలు అంశాలకు ఆమోదం తెలిపారు. 

News April 2, 2025

ఏపీకి నూతన రైల్వే ప్రాజెక్టులు కేటాయించారా?: వేమిరెడ్డి

image

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వివరించాలని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కోరారు. వేమిరెడ్డి ప్రశ్నలకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్టవ్‌ సమాధానమిచ్చారు. రైల్వే ప్రాజెక్టుల కేటాయింపు రాష్ట్రాలు, జిల్లాల వారీగా ఉండదన్నారు. రైల్వే జోన్ల వారీగా ఉంటుందన్నారు. పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.

error: Content is protected !!