News March 31, 2025

నల్గొండ: మద్యం మత్తులో భార్యను చంపిన భర్త

image

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం పరిధిలోని తెరాటిగూడెంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యను హత్య చేశాడో భర్త. రోజూ తాగి వస్తున్న భర్తతో భార్య అరుణ(35) సోమవారం గొడవకు దిగింది. దీంతో ఆవేశానికి గురైన భర్త గొడ్డలితో ఆమెపై దాడి చేయడంతో అరుణ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 9, 2026

మేడారం దారుల్లో 2 కి.మీకో చెక్‌పోస్ట్: ఎస్పీ

image

మేడారంలో క్రౌడ్, క్రైం కంట్రోల్ కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని ఎస్పీ సుధీర్ కేకన్ తెలిపారు. మీడియాతో ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. మల్టీ జోన్ -1ఐజీ పర్యవేక్షణలో 20 మందికి పైగా ఐపీఎస్ అధికారులు, 12 వేల మంది సిబ్బంది పని చేస్తారని చెప్పారు. మేడారం-పస్రా, మేడారం -తాడ్వాయి రూట్, ప్రధాన దారుల్లో ప్రతీ రెండు కిలోమీటర్లకు పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తామన్నారు.

News January 9, 2026

ట్రంప్ మాస్టర్ ప్లాన్.. గ్రీన్‌లాండ్ ప్రజలకు డాలర్ల వల?

image

గ్రీన్‌లాండ్‌ను చేజిక్కించుకునేందుకు ట్రంప్ టీమ్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. అక్కడి ప్రజలను ప్రలోభపెట్టేందుకు ఒక్కొక్కరికి లక్ష డాలర్ల వరకు ఆఫర్ చేయాలని వైట్‌హౌస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కుదరకపోతే COFA ఒప్పందం ఆప్షన్‌ను పరిశీలిస్తున్నారట. దీని ప్రకారం.. గ్రీన్‌లాండ్‌లో US ఆర్మీ కార్యకలాపాలు కొనసాగించుకుంటుంది. దీనికి ప్రతిఫలంగా USతో గ్రీన్‌లాండ్‌ డ్యూటీ ఫ్రీ ట్రేడ్ చేసుకోవచ్చు.

News January 9, 2026

VJA: దైవ దర్శనాల పేరుతో టోకరా.. పోలీసులకు ఫిర్యాదు!

image

మాజీ ఎంపీ కనకమెడల రవీంద్ర పేరు చెప్పి దైవ దర్శనాల సాకుతో కొందరు కేటుగాళ్లు భారీ వసూళ్లకు పాల్పడ్డారు. భక్తులను నమ్మించి నగదు వసూలు చేస్తున్న విషయం బాధితుల ద్వారా ఆయన దృష్టికి రావడంతో రవీంద్ర తీవ్రంగా స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు సహాయ కార్యదర్శి ప్రసాద్ శుక్రవారం పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మోసపూరిత వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల కోసం ఆరా తీస్తున్నారు.