News March 31, 2025

సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవాలి: పల్లా

image

టీడీపీ సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు నడుచుకోవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. సోమవారం అచ్యుతాపురంలో పార్టీ కార్యకర్తల సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఐదేళ్లు కష్టపడి పార్టీని కార్యకర్తలు అధికారంలోకి తీసుకువచ్చారని అన్నారు.

Similar News

News April 3, 2025

విశాఖ: భర్త దాడిలో భార్య మృతి

image

విశాఖలో వివాహిత రమాదేవి చికిత్స పొందుతూ మృతిచెందింది. మాధవధారకు చెందిన రమాదేవి, బంగార్రాజు మధ్య గొడవలు జరగ్గా రమాదేవి పుట్టింటికి వెళ్లింది. గతనెల 30న బంగార్రాజు అక్కడికి వెళ్లి గొడవపడ్డాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బయలుదేరగా అడ్డగించి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను KGHకి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. నిందితుడిని టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

News April 3, 2025

TTC ట్రైనింగ్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానం: డీఈవో

image

విశాఖ జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో TTC ట్రైనింగ్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు డీఈవో ప్రేమ్ కుమార్ బుధవారం తెలిపారు. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 25లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. మే1 నుంచి జూన్ 11 వరకు ట్రైనింగ్ ఇవన్నున్నట్లు తెలిపారు. 18 నుంచి 45 సంవత్సరాల లోపు వారు అర్హులన్నారు. పూర్తి వివరాలు, అప్లికేషన్‌కు www.bse.ap.gov.inలో చెక్ చేయాలన్నారు. మే 1 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయన్నారు.

News April 2, 2025

రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం: విశాఖ సీపీ

image

విశాఖ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా ప్రమాద బాధితులకు బుధవారం లక్ష రూపాయలు పరిహారం అందజేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఇటీవల హిట్ రన్‌లో తీవ్ర గాయాలపాలైన మొండెం రామక్రిష్ణ, జన సన్యాసప్పాడుకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేశారు. ఇప్పటివరకు ఈ కేంద్రం ద్వారా 32 మందికి రూ.26,50,000 ఇచ్చినట్లు తెలిపారు.

error: Content is protected !!