News March 31, 2025
రంజాన్.. HYDలో వీటికి ఫుల్ DEMAND

HYD నగరంలో రంజాన్ పండుగ వేళ బిర్యానీ, క్యాబ్స్, బుకింగ్ ఆటోలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. పండగ కావడంతో రెడ్ హిల్స్ లాంటి అనేక ప్రాంతాల్లో ముస్లిం ఆటో డ్రైవర్లు సెలవు తీసుకున్నారు. మరోవైపు పండగ వేళ నగరంలో రద్దీగా ఉండడంతో సాధారణ రోజులతో పోలిస్తే బుకింగ్ ఆటోలకు 20 నుంచి 30 శాతం అధికంగా చార్జీలు పడుతున్నట్లు ప్రయాణికులు తెలిపారు. ఆన్‌లైన్ ఆర్డర్లతో రెస్టారెంట్లు, హోటల్స్ కిక్కిరిస్తున్నాయి.
Similar News
News April 3, 2025
సిరిసిల్ల: వరుస దొంగతనాలు.. జాగ్రత్త..!

సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఇటీవల వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మార్చి 15 శనివారం ఇల్లంతకుంట మండలం రేపాకలోని ఎల్లమ్మ ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు గుడి తలుపులు పగలగొట్టి హుండీని ఎత్తుకెళ్లారు. మార్చి 28 శుక్రవారం బోయినపల్లి మండలం కొదురుపాకలో సట్టా జలజ ఇంట్లో దొంగతనం జరిగింది. వరుస దొంగతనాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు, పోలీసులు హెచ్చరించారు.
News April 3, 2025
కరీంనగర్: వరుస దొంగతనాలు.. జాగ్రత్త..!

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మార్చి 23 ఆదివారం అర్ధరాత్రి శంకరపట్నం మండలం లింగాపూర్‌లో ఏకంగా 6 ఇళ్లలో దొంగతనాలు జరిగిన విషయం తెలిసిందే. మార్చి 14న మానకొండూరు జడ్పీహెచ్‌ఎస్‌లో 23 ట్యాబ్‌లను గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేశారు. వరుస దొంగతనాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు.
News April 3, 2025
పార్వతీపురం: బీసీ కార్పొరేషన్ రుణాలకు రేపు బ్యాంకర్ల ఇంటర్వ్యూలు

బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తుదారులకు ఈ నెల 4న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. పార్వతీపురంలోని మెప్మా కార్యాలయంలో పలు బ్యాంకుల అధికారులు పాల్గొని ఇంటర్వ్యూలు చేస్తారని పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 15 సచివాలయాల నుంచి 968 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.