News March 31, 2025
రేపు లబ్ధిదారుల ఇంటి వద్ద పెన్షన్ల పంపిణీ: కలెక్టర్

ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు ఏప్రిల్ 1వ తేదీన ఉదయం 7.00 గంటల నుంచి లబ్ధిదారుల ఇంటి వద్దనే పంపిణీ చేయాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సచివాలయం సిబ్బంది, డీఎల్డీఓలు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు.
Similar News
News April 3, 2025
SRPT: ఆర్మీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి తెలిపారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్, ట్రేడ్‌మెన్ పోస్టులు ఉన్నాయన్నారు. ఐటీఐ, డిప్లొమా, ఎన్‌సీసీ కలిగిన వారికి బోనస్ మార్కులు ఉంటాయని పేర్కొన్నారు. www. joinindianarmy.nic.వెబ్‌సైట్‌లో ఈ నెల 10 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 04027740205 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
News April 3, 2025
చోడవరం: చెట్టు పైనుంచి జారిపడి మృతి

చోడవరం మండలం నరసయ్యపేట గ్రామ శివారు ప్రాంతంలో బుధవారం సాయంత్రం కల్లు తీయటానికి తాటి చెట్టు ఎక్కిన కల్లుగీత కార్మికుడు మేడిశెట్టి నూకరాజు (30) ప్రమాదవశాత్తు జారిపడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నూకరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. అటుగా వెళుతున్న రైతులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చోడవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News April 3, 2025
తిరుపతి మార్గంలో తప్పిన పెనుప్రమాదం

భాకరాపేట ఘాట్ రోడ్డులో బుధవారం మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. కొంత మంది ప్రయాణికులతో మదనపల్లె నుంచి ఆర్టీసీ బస్సు తిరుపతికి బయల్దేరింది. ఘాట్ రోడ్డులోకి రాగానే బస్ బ్రేక్‌లు ఫెయిలయ్యాయి. గమనించిన డ్రైవర్ ప్రయాణికులను అలర్ట్ చేశారు. ఆ తర్వాత చాకచక్యంగా రోడ్డు పక్కన ఉన్న కొండను ఢీకొట్టారు. కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రాణనష్టం తప్పింది.