News March 31, 2025
IPL: టాస్ గెలిచిన ముంబై

వాంఖడే స్టేడియంలో కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచింది. కెప్టెన్ హార్దిక్ పాండ్య బౌలింగ్ ఎంచుకున్నారు. MI తరఫున అశ్వనీ కుమార్ అరంగేట్రం చేస్తున్నారు.
MI: రికెల్టన్, జాక్స్, సూర్య, తిలక్, హార్దిక్, నమన్ ధిర్, సాంట్నర్, దీపక్ చాహర్, బౌల్ట్, అశ్వనీ కుమార్, విఘ్నేశ్
KKR: డీకాక్, అయ్యర్, రహానే, రింకూ, రఘువంశీ, నరైన్, రస్సెల్, రమన్‌దీప్, జాన్సన్, రాణా, వరుణ్ చక్రవర్తి
Similar News
News February 17, 2026
కర్తరీలో శుభకార్యాలు ఎందుకు చేయకూడదు?

కర్తరీలో ఎండలుంటాయి. బయట పనులు చేసేందుకు వాతావరణం అనుకూలంగా ఉండదు. అందుకే గృహ నిర్మాణం, శంకుస్థాపన, చెట్లు నరకడం, బావులు తవ్వడం పనులు నిషేధించారు. విపరీత వేడి వల్ల సిమెంట్, సున్నం వంటి నిర్మాణ సామాగ్రి పగుళ్లిచ్చే అవకాశముంటుంది. చెట్లు నరికితే తిరిగి చిగురించవు. శుభకార్యాలకు వచ్చే అతిథులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. ప్రకృతిని, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ శాస్త్రాలు ఈ నియమాలు వచ్చాయి.
News February 17, 2026
IARIలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

<
News February 17, 2026
150కి 20 మార్కులొచ్చినా టీచర్ జాబ్.. విమర్శలు

ఉపాధ్యాయ నియామకాల్లోనూ రిజర్వేషన్లు ఉండటంపై విమర్శలొస్తున్నాయి. ఒడిశా టీచర్ నియామకాల్లో రిజర్వేషన్ల వారీగా ఉన్న మార్కుల వ్యత్యాసాన్ని చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. రిజర్వ్‌డ్ కేటగిరీకి 20/150 మార్కులు వచ్చినా ఉద్యోగం లభిస్తే.. EBC అభ్యర్థులకు 121 మార్క్స్ రావాల్సిందే. ఇంత తక్కువ మార్కులు వచ్చిన వారు పిల్లలకు ఎలా బోధిస్తారని, ఇది విద్యావ్యవస్థ నాణ్యతను దెబ్బతీస్తుందని చెబుతున్నారు. మీ కామెంట్?


