News March 31, 2025
KKD: తుది జట్టు నుంచి రాజును తప్పించిన ముంబై

కాకినాడ యువ క్రికెటర్ సత్యనారాయణ రాజును ముంబై ఇండియన్స్ తన మూడో మ్యాచ్లో తుది జట్టు నుంచి తప్పించింది. తొలి రెండు మ్యాచ్లకు అవకాశం ఇచ్చి మూడో మ్యాచ్లో పక్కన పెట్టింది. కేకేఆర్ మ్యాచ్లో రాజు స్థానంలో అశ్విని కుమార్ను బరిలోకి దింపింది. కాగా సత్యనారాయణ రాజు రెండు మ్యాచ్ల్లో కలిపి కేవలం ఒక వికెట్ తీశారు.
Similar News
News April 7, 2025
ధర్మవరంలో రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్

ధర్మవరం ప్రభుత్వ బాలుర క్రీడా మైదానంలో ఈనెల 6 నుంచి 9 వరకు 15వ ఏపీ స్టేట్ ఛాంపియన్షిప్ హాకీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు ఈ కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ హాకీ పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా 22 టీంలు, 440 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.
News April 7, 2025
రామప్పలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

వెంకటాపూర్ మండలం పాలంపేటలో గల ప్రపంచ ప్రసిద్ధి చెంది యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని ఈనెల 14న మిస్ వరల్డ్ టీం సందర్శించనున్న నేపథ్యంలో ఆదివారం జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ వెంట రాష్ట్ర పర్యాటక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి తదితరులు ఉన్నారు. మిస్ వరల్డ్ టీం ఆలయంతో పాటు, రామప్ప సరస్సు, కాటేజీలను సందర్శించనుంది.
News April 7, 2025
SRD: పది మూల్యాంకనానికి ఏర్పాట్లు పూర్తి: డీఈఓ

రామచంద్రపురం మండలంలోని సెయింట్ ఆర్నాల్డ్ పాఠశాలలో రేపటి నిర్వహించే పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. 1222 మంది ఉపాధ్యాయులను నియమించామని, మూల్యాంకన కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.