News March 31, 2025

రంజాన్ వేళ.. HYDలో వీటికి ఫుల్ DEMAND

image

HYD నగరంలో రంజాన్ పండుగ వేళ బిర్యానీ, క్యాబ్స్, బుకింగ్ ఆటోలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. పండగ కావడంతో రెడ్ హిల్స్ లాంటి అనేక ప్రాంతాల్లో ముస్లిం ఆటో డ్రైవర్లు సెలవు తీసుకున్నారు. మరోవైపు పండగ వేళ నగరంలో రద్దీగా ఉండడంతో సాధారణ రోజులతో పోలిస్తే బుకింగ్ ఆటోలకు 20 నుంచి 30 శాతం అధికంగా చార్జీలు పడుతున్నట్లు ప్రయాణికులు తెలిపారు. ఆన్‌లైన్ ఆర్డర్లతో రెస్టారెంట్లు, హోటల్స్ కిక్కిరిస్తున్నాయి.

Similar News

News July 11, 2025

రేపు మహాకాళి టెంపుల్‌కు గవర్నర్, మంత్రి రాక

image

సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని బోనాల జాతర నేపథ్యంలో మహాకాళి దేవస్థానాన్ని రేపు శుక్రవారం గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, HYD ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించనున్నట్లు దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జీ.మనోహర్‌రెడ్డి తెలిపారు. రేపు ఉ.9గంటలకు వీరు మహాకాళి అమ్మవార్లను దర్శించుకుంటారన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌తో పాటు మంత్రి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయనున్నారు.

News July 11, 2025

బీసీ గురుకుల పాఠశాల్లో సీట్ల సంఖ్య పెంచాలి: కృష్ణయ్య

image

బీసీ గురుకుల పాఠశాలల్లో తరగతి గదులు, సీట్లు పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ గురుకుల పాఠశాలల్లో వేల సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారని దీంతో విద్యార్థులు సీట్లు దొరక్క అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. సీట్ల సంఖ్యను పెంచాలని కోరుతూ ఆయన గురువారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.

News July 10, 2025

ఓయూ లా కోర్సుల పరీక్షా తేదీల ఖరారు

image

ఓయూ పరిధిలోని లా కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. మూడేళ్ల LLB, మూడేళ్ల LLB ఆనర్స్ ఆరో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్, ఐదేళ్ల BA LLB, ఐదేళ్ల BBA LLB, ఐదేళ్ల BCom LLB 2, 6, 8, 10వ సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్, పరీక్షలను ఈ నెల 22వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు.