News March 31, 2025

KNR: డిప్యూటీ కలెక్టర్‌కు ఎంపికైన హరిణి

image

కరీంనగర్‌లోని విద్యానగర్‌కు చెందిన కన్నం హరిణి గ్రూప్-1లో 499.5మార్కులతో స్టేట్ 55వ ర్యాంక్ సాధించి, డిప్యూటీ కలెక్టర్‌కు సెలెక్ట్ అయ్యారు. హరిణి తల్లిదండ్రులు రమేష్, కళా ప్రపూర్ణ జ్యోతి ప్రభుత్వ టీచర్లు. విద్యానగర్‌లోనే ప్రాథమిక విద్యాను అభ్యసించిన హరిణి ఇంజనీరింగ్ పూర్తిచేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. అనంతరం ఎలాంటి కోచింగ్ లేకుండా సొంతంగా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యారు.

Similar News

News April 3, 2025

కరీంనగర్: ముగిసిన పదిపరీక్షలు.. పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి!

image

పదోతరగతి పరీక్షలు ముగిశాయి. దీంతో విద్యార్థులు ఫ్రీ బర్డ్స్ లాగా విచ్చలవిడిగా తిరగాలని భావిస్తారు. కావున తల్లిదండ్రులు వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు మోటార్ బైకులు ఇవ్వొద్దు. స్నేహితులతో చెరువులకు వెళ్లకుండా చూడాలి. వారు ఈత నేర్చుకుంటానంటే తల్లిదండ్రుల పర్యవేక్షణలో నేర్చుకోవాలి. మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారా లేదా గమనిస్తూ ఉండాలంటున్నారు. PLEASE SHARE IT.

News April 2, 2025

జమ్మికుంట: భారీగా పెరిగిన పత్తి ధర

image

సుదీర్ఘ సెలవుల అనంతరం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌ ప్రారంభం కాగా.. పత్తి ధర భారీగా పెరిగింది. బుధవారం మార్కెట్‌కు 9 వాహనాల్లో రైతులు 109 క్వింటాల విడిపత్తి విక్రయానికి తీసుకురాగా..గరిష్ఠంగా రూ.7,380, కనిష్ఠంగా రూ.7,250 పలికింది. గోనెసంచుల్లో 13 క్వింటాళ్లు రాగా ₹5,300 నుంచి ₹5,500 వరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. గతవారం కంటే తాజాగా పత్తిధర ₹150 పెరిగింది. ధరలు మరింత పెరగాలని రైతులు కోరుకుంటున్నారు.

News April 2, 2025

కరీంనగర్: కలెక్టరేట్లో సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి

image

కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

error: Content is protected !!