News March 31, 2025

నాగర్‌కర్నూల్: ఢిల్లీకి బయలుదేరిన కల్వకుర్తి నాయకులు

image

స్థానిక సంస్థల్లో, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఉద్దేశంతో ఈరోజు హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి వేలాది మంది బీసీ నాయకులు ప్రత్యేక రైల్లో ఢిల్లీకి బయలుదేరారు. ఏప్రిల్ 2న జంతర్ మంతర్ వద్ద జరిగే బీసీల పోరు గర్జన సభను విజయవంతం చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేశ్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. కల్వకుర్తి నుంచి నాయకులు వెళ్లారు. 

Similar News

News April 3, 2025

గంభీరావుపేట: ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి

image

గంభీరావుపేట మండలం ముస్తఫానగర్‌లో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు బుధవారం బావిలో పడి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. శివంది దేవయ్య(47) తన వ్యవసాయ పొలం వద్ద బావిని పూడిక తీసేందుకు పనులు చేపట్టాడు. పనులు ఎక్కడ వరకు వచ్చాయి అనే క్రమంలో తొంగి చూసే ప్రయత్నం చేయగా అందులో కాలు జారిపడి బావిలో పడడంతోతీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు దేవయ్యను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందతూ రాత్రి మృతిచెందాడు.

News April 3, 2025

చిత్తూరు: నేటి నుంచి స్పాట్ వాల్యుయేషన్

image

చిత్తూరు జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం నుంచి టెన్త్ మూల్యాంకనం జరగనున్నట్లు డీఈవో వరలక్ష్మి తెలిపారు. 10వ తేదీ వరకు స్పాట్ వాల్యుయేషన్ కొనసాగుతుంది.  1,244 మంది టీచర్లకు ఈ బాధ్యత అప్పగించారు. ప్రతి టీచర్ తప్పనిసరిగా మూల్యాంకన విధులకు హాజరు కావాలన్నారు. పేపర్లు కరెక్షన్ చేసే సమయంలో సెల్‌ఫోన్ వాడరాదని స్పష్టం చేశారు.

News April 3, 2025

జనగామ: దరఖాస్తుల ఆహ్వానం 

image

మహాత్మ జ్యోతిబాఫూలే విదేశీ విద్యా నిధి (బీసీ ఓవర్సీస్) పథకం కింద జిల్లాలోని బీసీ, ఈ బీసీ విద్యార్థులు విదేశాలలో చదువుకై దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రవీందర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 30వ తేదీ వరకు అప్లై చేసుకోవాలన్నారు. వివరాలకు www.telanganaepass.cgg.gov వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.

error: Content is protected !!