News March 31, 2025
‘నోబెల్’కు పాక్ మాజీ PM ఇమ్రాన్ నామినేషన్

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోమారు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. పాకిస్థాన్ వరల్డ్ అలయెన్స్(PWA) ఈ నామినేషన్ వేసింది. పాక్లో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల రక్షణలో ఆయన ఎనలేని సేవ చేశారంటూ ఈ సందర్భంగా కొనియాడింది. గతంలో భారత పైలట్ అభినందన్ను విడుదల చేసినందుకు గాను ఇమ్రాన్ ఖాన్ను నోబెల్కు నామినేట్ చేస్తూ పాక్ పార్లమెంటు తీర్మానం చేసింది. ప్రస్తుతం ఇమ్రాన్ పాక్ జైల్లో ఉన్నారు.
Similar News
News April 3, 2025
నా వయసును నమ్మలేకపోతున్నాను: రష్మిక

ఈ నెల 5న 29వ పుట్టినరోజు చేసుకోనున్నట్లు హీరోయిన్ రష్మిక ఇన్స్టాలో పోస్ట్ చేశారు. 29 ఏళ్లనే విషయం తనకే నమ్మశక్యంగా లేదని పేర్కొన్నారు. ఇది తన బర్త్ డే మంత్ అని పేర్కొంటూ వయసు పెరిగే కొద్దీ పుట్టినరోజును జరుపుకునేందుకు మరింత ఉత్సాహంగా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ బ్యూటీ కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఆమె నటించిన ‘సికందర్’ ఇటీవల థియేటర్లలో విడుదలైంది.
News April 3, 2025
SRHకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆహ్వానం

HCAతో SRHకు వివాదం నెలకొన్న వేళ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ACA) సన్రైజర్స్ జట్టును APకి ఆహ్వానించింది. ఈ సీజన్లోని మిగతా మ్యాచ్లను విశాఖలో నిర్వహించాలని కోరింది. పన్ను మినహాయింపులు కూడా ఇస్తామని ఆఫర్ చేసింది. కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో SRH, HCA మధ్య వివాదం నెలకొనగా సీఎం రేవంత్ ఆదేశాలతో HCA దిగొచ్చింది. మరోవైపు ఈ సీజన్లో విశాఖలో 2 IPL మ్యాచ్లు జరిగిన విషయం తెలిసిందే.
News April 3, 2025
ట్రంప్ టారిఫ్లు ఎదురుదెబ్బ కాదు: కేంద్ర ప్రభుత్వ వర్గాలు

భారతదేశ దిగుమతులపై అమెరికా 26% టారిఫ్ విధించడాన్ని తాము ఎదురుదెబ్బగా భావించట్లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇది మిశ్రమ ఫలితమే అని తేల్చి చెప్పాయి. ఇరుదేశాల మధ్య వాణిజ్య సమస్యలను పరిష్కరిస్తే ఈ టారిఫ్లు తగ్గే అవకాశం ఉందని వెల్లడించాయి. ఈ మేరకు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయని వివరించాయి. మరోవైపు, మన దేశ ఫార్మా ఉత్పత్తులకు టారిఫ్ నుంచి ట్రంప్ మినహాయింపు ఇచ్చారు.