News March 31, 2025

HYD: కోడి పందాల స్థావరంపై దాడులు

image

కోడి పందాలు ఆడుతున్నారన్న సమాచారంతో పేట్ బషీరాబాద్ పోలీసులు దాడి చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా.. మున్సిపాలిటీ పరిధి దేవరయాంజాల్‌లోని బాల్ రెడ్డి తోటలోని కోడి పందాలు ఆడుతున్న స్థావరంపై సోమవారం సాయంత్రం పోలీసులు దాడులు చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకోగా, 2 కోడి పుంజులు, 15 కోడి కత్తులు, 7 ఫోన్లు, 3 బైకులు, 26వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News July 6, 2025

కొడిమ్యాల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు

image

కొడిమ్యాల మండలం తుర్క కాశీనగర్ వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని సెంటర్ల పల్లి గ్రామానికి చెందిన బుచ్చిబాబు వేములవాడ మండలానికి చెందిన మారుతిలు పని నిమిత్తం కరీంనగర్ వైపు స్కూటీపై వెళ్తున్నారు. ఈ క్రమంలో జగిత్యాల-కరీంనగర్ హైవేపై వెళ్తున్న లారీ స్కూటీని ఢీ కొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు.

News July 6, 2025

విదేశీ గడ్డపై భారత్ సరికొత్త చరిత్ర

image

ఇంగ్లండ్‌పై రెండో టెస్టులో విజయంతో గిల్ సేన సరికొత్త రికార్డు సృష్టించింది. పరుగుల(336) పరంగా విదేశాల్లో భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. 2019లో వెస్టిండీస్‌పై 318, 2017లో శ్రీలంకపై 304, 2024లో పెర్త్‌లో ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో గెలుపొందింది. చారిత్రక విజయం సాధించిన భారత జట్టుకు కోహ్లీ, గంగూలీ అభినందనలు తెలిపారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో ప్లేయర్లు అదరగొట్టారని కొనియాడారు.

News July 6, 2025

రెవెన్యూ సమస్యలకు త్వరలోనే చెక్: మండపల్లి

image

రాయచోటిలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజాదర్బార్ ఆదివారం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన 22 అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.