News April 1, 2025
VKB: జిల్లాలో నేటి..TOP NEWS!!

ఘనంగా రంజాన్ వేడుకలు
రంజాన్ EFFECT.. ఈద్గాల వద్ద భారీ బందోబస్తు
ఈద్గా వద్ద నాయకుల సందడి
ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మంత్రి కావాలి: ముస్లింలు
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు,ఎస్పీలు
పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
తాండూరు: బషీరాబాద్‌లో యాక్సిడెంట్
వికారాబాద్ జిల్లా @ 38 డిగ్రీలు
రవీంద్ర భారతి ఉగాది వేడుకల్లో వికారాబాద్ ఒగ్గుడోలు
Similar News
News April 6, 2025
అంబేద్కర్ కోనసీమ: సోమవారం యథావిధిగా గ్రీవెన్స్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక- గ్రీవెన్స్ కార్యక్రమం ఈ నెల 7న సోమవారం ఉదయం 10 గంటల నుంచి యథావిధిగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ గోదావరి భవన్‌లో జరుగనుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి పరిష్కారించుకోవాలని ఆయన సూచించారు. డివిజన్, మండల, మునిసిపల్ స్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
News April 6, 2025
స్టార్ హీరోయిన్‌పై నిర్మాత కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌పై స్త్రీ-2 మూవీ నిర్మాత దినేశ్ విజాన్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. శ్రద్ధా నవ్వితే అచ్చం దెయ్యంలా ఉంటుందని, అందుకే స్త్రీ మూవీలో ఎంపిక చేసినట్లు దినేశ్ చెప్పారని ఆ సినిమా డైరెక్టర్ అమర్ కౌశిక్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో శ్రద్ధా ఫ్యాన్స్ దినేశ్‌పై మండిపడుతున్నారు. ఆమె పేరుతో డబ్బులు సంపాదించుకుని ఇలా అవమానించడం సరికాదని కామెంట్స్ చేస్తున్నారు.
News April 6, 2025
అందరూ రామాయణం, భారతం చదవాలి: వెంకయ్య

AP: శ్రీరాముడు అసమానతలు లేని ఆదర్శ పాలన చేశారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని పాలన చేయాలని నాయకులకు సూచించారు. నెల్లూరు(D) చౌటపాళెంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో మాట్లాడుతూ ‘ప్రతిఒక్కరూ రామాయణం, మహాభారతం చదవాలి. అలా చేయకపోవడం వల్లే అశాంతి నెలకొంది. చిన్నపిల్లలు కూడా హత్యలు, అత్యాచారాలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు’ అని పేర్కొన్నారు.