News April 1, 2025

ఆరుబయట పడుకుంటున్నారా?

image

వేసవి కారణంగా చాలామంది ఆరుబయటో, మేడపైనో పడుకుంటుంటారు. ఒకప్పుడైతే వేసవినాటికి దోమలు పోయేవి. కానీ నేడు విషజ్వరాలను కలిగించే దోమల సంతతి వేసవిలోనూ ఉంటోంది. ఈ నేపథ్యంలో బయట పడుకునేవారు కచ్చితంగా దోమల తెరను వాడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పడుకునే చోటుకు కొంచెం దూరంలో సాంబ్రాణి ధూపం వేస్తే ఆ వాసనకు దోమలు దూరంగా ఉంటాయంటున్నారు. కాళ్లకు చేతులకు నూనె రాసుకున్నా ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

Similar News

News September 10, 2025

సూపర్-6 అట్టర్ ఫ్లాప్: వైసీపీ

image

AP: దీపం పథకం కింద ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితమంటూ ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైసీపీ విమర్శించింది. మొదటి ఏడాది ఒక సిలిండర్ ఇచ్చి మమ అనిపించిందని, మిగతావి ఇప్పటి వరకు అతీగతీ లేవని దుయ్యబట్టింది. ఇప్పుడు ఆ పథకం ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదని ఎద్దేవా చేసింది. ప్రజలను మోసగించి విజయోత్సవాలు చేసుకునేందుకు సిగ్గుండాలని మండిపడింది.

News September 10, 2025

వారసుడితో నాగబాబు ఫ్యామిలీ

image

వరుణ్-లావణ్య జోడీ మగబిడ్డకు జన్మనివ్వడంతో నాగబాబు కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. మనవడి రాకతో తమ కుటుంబ భవిష్యత్తుకు సరికొత్త కాంతి వచ్చిందని నాగబాబు ట్వీట్ చేశారు. ‘సింహం కూనకు స్వాగతం. నీవు నా హృదయంలో గర్జించావు. నీ చేతిని పట్టుకొని నడిచేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని రాసుకొచ్చారు. కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేశారు.

News September 10, 2025

సబిత, సునీత కాంగ్రెస్‌లో చేరట్లేదు: బీఆర్ఎస్ నేత కార్తీక్

image

TG: బీఆర్ఎస్ MLAలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని సబిత కుమారుడు, బీఆర్ఎస్ నేత కార్తీక్ స్పష్టతనిచ్చారు. ఇంతకాలం ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని తాము పట్టించుకోలేదని, కానీ ఇకపై ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. ఇలాంటి వార్తలను ప్రచురించే వారికి(యూట్యూబ్ ఛానెల్స్) లీగల్ నోటీసులు ఇస్తామని, వాళ్లు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని హెచ్చరించారు.