News April 1, 2025
SRPT: సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: ఎస్పీ

సైబర్ నేరాలపై యువత అప్రమత్తత, అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు రావడం, ఉచితంగా బహుమతులు పొందడం, మన ప్రమేయం లేకుండా ఏదైనా వస్తుంది అంటే దాని వెనుక సైబర్ మోసగాళ్లు ఉన్నారని గ్రహించాలని తెలిపారు. సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోయారా? మీ డబ్బును పోగొట్టుకున్నారా? అయితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.
Similar News
News February 24, 2026
గద్వాల జిల్లా వాసులకు అలర్ట్.. రేపు నీటి సరఫరా బంద్!

మరమ్మతుల కారణంగా బుధవారం గద్వాల జిల్లాలోని పలు ప్రాంతాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోనుంది. ధరూర్ మండలం రేవులపల్లి వద్ద ఉన్న నీటి శుద్ధి కర్మాగారాన్ని ఫిబ్రవరి 25న శుభ్రపరచనున్నట్లు గ్రిడ్ డిప్యూటీ ఈఈ రవిచంద్ర కుమార్ రెడ్డి వెల్లడించారు. రేపు రోజంతా ప్లాంట్ క్లీనింగ్ పనులు జరుగుతాయని, అందువల్ల నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.
News February 24, 2026
ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో ఆకస్మిక తనిఖీలు

ఆసిఫాబాద్ కలెక్టరేట్ భవనంలోని ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ హరిత అకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి సమయపాలనపై అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు విధులకు సమయానికి హాజరవుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
News February 24, 2026
కీరదోసలో పండు ఈగ కట్టడికి విషపు ఎర తయారీ

పండు ఈగ వల్ల పంటలకు కలిగే నష్టం చాలా ఎక్కువ. ఇవి ఆశించిన పంటల కాయలు, పండ్లు కుళ్లిపోయి అమ్మకానికి పనికిరాకుండా పోతాయి. పండు ఈగ నివారణకు విషపు ఎరను తయారు చేసుకోవాలి. దీని కోసం మలాథియాన్ 100ml, 100గ్రా. బెల్లాన్ని 10లీటర్ల నీటిలో కలిపి మట్టి గిన్నెలో పోసి ఎకరాకు 10-12 చోట్ల ఉంచాలి. దీనిలో పులిసిన కల్లు మడ్డి కలిపితే తల్లి పండు ఈగలు మరింత ఎక్కువగా ఆకర్షించబడి ఈ విషపదార్థాన్ని తిని చనిపోతాయి.


