News March 26, 2024

హాజీపూర్‌లో బాబాయిపై అబ్బాయి పోటీ

image

బిహార్‌లో ఆసక్తికర రాజకీయానికి తెరలేచింది. దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ కంచుకోట హాజీపూర్‌లో బాబాయి పశుపతిపై అబ్బాయి చిరాగ్ పోటీ చేయనున్నారు. చిరాగ్ పార్టీతో BJP <<12883342>>పొత్తు<<>> పెట్టుకోవడంతో ఇటీవల పశుపతి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. తనతోపాటు నలుగురు సిట్టింగ్ ఎంపీలు RLJP నుంచి పోటీ చేస్తారని తెలిపారు. మరోవైపు హాజీపూర్‌లో పశుపతిని ఓడించి తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తానని చిరాగ్ చెబుతున్నారు.

Similar News

News March 25, 2026

ఉమ్మడి వరంగల్‌లో కొత్తగా 9 సీట్లు పెరిగే ఛాన్స్!

image

ఉమ్మడి వరంగల్‌లో జనాభా లెక్కల ప్రకారం అసెంబ్లీ స్థానాలు 9 పెరిగి 21 అయ్యే అవకాశం కనిపిస్తోంది. HNKలో 2 సీట్లుండగా కొత్తగా మరో 4, WGLలో 3 ఉండగా మరో 2, BHPLలో 1 ఉండగా మరొకటి, MHBDలో 2కి అదనంగా మరో 2 పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే జనగామ(3), ములుగు(1)లో మాత్రం పెరిగే అవకాశం లేదు. WGL-HNK జిల్లాలో జనాభా 20 లక్షలకు పైగా ఉండటంతో ఇక్కడే 6 స్థానాలు, మానుకోటలో 8 లక్షల జనాభాతో 4 సీట్లు కొత్తగా రాబోతున్నాయి.

News March 25, 2026

ఆముదం మొక్కల కొమ్మల కత్తిరింపుతో లాభాలు(2/2)

image

మొదటి కొమ్మను కత్తిరించిన వారం తర్వాత రెండవ కొమ్మ, రెండో గెలను ఉంచి మిగిలిన కొమ్మలను తీసివేయాలి. ఇలా విడతల వారీగా 5-6 గెలలను ఉంచి మిగిలినవి తీసివేయాలి. దీని వల్ల అనవసర కొమ్మల పెరుగుదల ఆగి, కణుపుల మధ్య దూరం తగ్గి మొక్క ఎత్తు తగ్గుతుంది. గెల పొడవు, గింజ లావుగా ఉండి తూకం ఎక్కువయ్యే అవకాశం ఉంది. పంట కాలం దాదాపు 40 రోజుల వరకు తగ్గుతుంది. మొక్క ఎత్తు తక్కువగా ఉంటే మందులను సులభంగా పిచికారీ చేయవచ్చు.

News March 25, 2026

అప్పుడు IPL క్రికెటర్.. ఇప్పుడు RCBకి ఛైర్మన్

image

IPL ఫ్రాంచైజీ RCBని ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్షియం <<19468471>>కొనుగోలు<<>> చేసిన సంగతి తెలిసిందే. RCB కొత్త ఛైర్మన్‌గా కుమార మంగళం బిర్లా కుమారుడు ఆర్యమాన్ బిర్లా ఎంపికయ్యారు. ఆయన దేశవాళీ క్రికెట్‌లో మధ్యప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించారు. 2018, 2019లో IPLలో RR జట్టు సభ్యుడిగా ఉన్నారు. కానీ తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. మానసిక ఆరోగ్య కారణాలతో 2019 చివర్లో ఆయన క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు.