News April 1, 2025

నేడు యాదాద్రికి మంత్రి కోమటిరెడ్డి

image

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెలికాప్టర్ ద్వారా ఉదయం 11గం.కు NLG కనగల్ మండలం గంధంవారి ఎడవెల్లి చేరుకొని IKP కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రూ.4కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. తర్వాత ఒంటిగంటకు యాదగిరిగుట్ట చేరుకొని సన్నబియ్యం పంపిణీ, మహిళ సంఘాలకు చెక్కులను పంపిణీ చేస్తారు. 3:30 గంటలకు తిరిగి HYD చేరుకుంటారు.

Similar News

News November 9, 2025

మాంగోలియా జైల్లో ఇరుక్కున్న సిక్కోలు వాసి

image

ఉపాధి నిమిత్తం విదేశానికి వెళ్లిన ఓ శ్రీకాకుళం జిల్లా వ్యక్తి అక్కడి జైల్లో ఇరుక్కున్నాడు. సంతబొమ్మాళి(M) లక్కీవలస పంచాయతీ పిట్టవానిపేటకు చెందిన తూలు గారయ్య 5నెలల అగ్రిమెంట్‌తో పెయింటింగ్ పనులకు వెళ్లాడు. ఈనెల 7న ఇండియాకు వస్తానంటూ అక్కడి ఎయిర్‌పోర్ట్ నుంచి ఫోన్ చేసిన తన భర్త ఇప్పటి వరకు రాలేదని భార్య తూలు ఎర్రమ్మ వాపోయారు. ప్రభుత్వం సాయం చేయాలని ఆమె కోరుతున్నాడు.

News November 9, 2025

డిసెంబర్ 15న IPL వేలం!

image

ఐపీఎల్ మినీ వేలం డిసెంబర్ 15న నిర్వహించే అవకాశం ఉందని TOI పేర్కొంది. గత రెండు వేలంపాటలను దుబాయ్, సౌదీ అరేబియాలో జరపగా ఈసారి ఇండియాలోనే నిర్వహించే ఛాన్స్ ఉందని తెలిపింది. కాగా రిటెన్షన్ డెడ్‌లైన్ ఈనెల 15న ముగియనుంది. ఈలోపు ఫ్రాంచైజీలు తాము అంటిపెట్టుకునే ప్లేయర్లను ప్రకటించాలి. అయితే CSK, RR జడేజా, శాంసన్‌ను ట్రేడ్ చేసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది.

News November 9, 2025

లిల్లీ పూల సాగు – అనువైన రకాలు

image

☛ సెమి-డబుల్ రకాలు: వీటిలో పూల రేకులు 2-3 వరుసలలో అమరి ఉంటాయి. ఉదా: CV. సెమీ-డబుల్.
☛ డబుల్ లిల్లీ రకాలు: ఈ పూల రేకులు 3 కన్నా ఎక్కువ వరుసలలో అమరి ఉంటాయి.
☛ ఉదా: సువాసిని, స్వర్ణ రేఖ, హైదరాబాద్ డబుల్, కలకత్తా డబుల్, వైభవ్, పెర్ల్ డబుల్. ఈ రకాలను ఎక్కువగా బొకేల తయారీలో వాడతారు. ☛ రైతులు ఏ ఉద్దేశంతో వీటిని సాగు చేయాలనుకుంటున్నారో అందుకు అనువైన రకాన్ని వ్యవసాయ నిపుణుల సూచనలతో ఎన్నుకోవడం మంచిది.